వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల్లో ఇంత ప్రేమ ఉందా? జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: నారా లోకేష్ సహా

|
Google Oneindia TeluguNews

అమరావతి: కొన్ని సందర్భాలు అనూహ్యంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏ మాత్రం ఊహకు అందలేనివి. అంచనాలకు దొరకనివి. ప్రత్యేకించి- రాజకీయాల్లో ఇలాంటి ట్విస్టులు, సంఘటనలు సంభవిస్తుండటం అనేక అనుమానాలకు దారి తీస్తుంటాయి. ఆ అనూహ్య ఘటనల వెనుక ఉన్న అర్థం.. పరమార్థం ఏమిటో చెప్పకనే చెబుతుంటాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో అలాంటి సందర్భమే ఒకటి చోటు చేసుకుంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే- జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు శుభాకాంక్షల వెల్లువను కురిపించడం..

బైరెడ్డి Vs బైరెడ్డి: కుటుంబంలో భగ్గుమన్న వర్గపోరు: సినీ ఫక్కీలో కొట్టుకున్న రెండు గ్రూపులుబైరెడ్డి Vs బైరెడ్డి: కుటుంబంలో భగ్గుమన్న వర్గపోరు: సినీ ఫక్కీలో కొట్టుకున్న రెండు గ్రూపులు

జూనియర్‌ను కలుపుకొనే ప్రయత్నమా?

తెలుగుదేశం అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు ఆ పార్టీ నాయకుల కంటికి ఏ మాత్రం ఆనలేదని భావిస్తూ వస్తోన్న జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరిద్దరు కీలక నాయకుల నుంచి శుభాకాంక్షలు అందడం అనూహ్య పరిణామేనని అంటున్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో జూ. ఎన్టీఆర్‌ను టీడీపీ నేతలు దాదాపుగా పక్కన పెట్టేసినట్టుగానే వ్యవహరించారు. మహానాడు వంటి పార్టీ పండుగలకు ఆయనను ఆహ్వానించలేదు. మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ దూరమై చాలా కాలమైంది. పార్టీ కార్యక్రమాలకూ ఆయన హాజరు కావట్లేదు. పూర్తిస్థాయిలో సినిమాలపైనే తన దృష్టిని కేంద్రీకరించారు.

హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి శుభాకాంక్షలు

బుధవారం జూ.ఎన్టీఆర్ బర్త్‌డే. హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అల్లాటప్పా నాయకులు కూడా కాదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ మొదలుకుని నిన్న మొన్నే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన కేశినేని శ్వేత వరకూ పలువురు సీనియర్ నాయకులు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జూనియర్‌పై ప్రేమాభిమానాలను కురిపించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. నారా లోకేష్‌కు పోటీగా ఎదుగుతాడనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరంగా ఉంచారనే విమర్శలు ఒకప్పుడు వినిపించాయి.

అప్పట్లో దూరం పెట్టిన వాళ్లే..

మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు నారా లోకేష్, గంటా శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, కేశినేని శ్వేత వంటి నాయకులు ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలను తెలుపుతూ ట్వీట్లు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పోల్చి మరీ శుభాకాంక్షలు చెబుతుండటం వెనుక ఉన్న పరమార్థమేంటనేది బోధపడట్లేదు. జూనియర్‌ను దగ్గరకు చేరతీసే ప్రయత్నాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందనే అంటున్నారు.

English summary
Telugu Desam Party senior leaders and Ex miniters Nara Lokesh, Ganta Srinivas, Kesineni Swetha and some other leaders from same party was greets to tollywood top actor Jr NTR on his birthday on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X