వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నక్యాంటీన్ల మూసివేతపై 16న టీడీపీ నిరసనలు .. అప్పుడే మొదలెట్టేసిన బంగి అనంతయ్య

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే భోజన వసతిని కల్పిస్తూ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. దీంతో నిరుపేదల ఆకలి తీర్చే అన్న కాంటీన్ లను మూసివేయడం తగదని, వెంటనే వాటిని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని టిడిపి ఆందోళన బాట పట్టింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనూ ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.టీడీపీ ఆందోళనలు చేస్తున్నా వైసీపీ మాత్రం తమపని తాము చేసుకుపోతామన్నట్టు ప్రవర్తిస్తుంది.

అన్న క్యాంటీన్ ల మూసివేతపై కొనసాగుతున్న రగడ ... టీడీపీ వర్సెస్ వైసీపీ

అన్న క్యాంటీన్ ల మూసివేతపై కొనసాగుతున్న రగడ ... టీడీపీ వర్సెస్ వైసీపీ

అన్న కాంటీన్ లను మూసివేసి , అన్న క్యాంటీన్ల విషయంలోనూ అవినీతికి పాల్పడిందని వైసిపి ఆరోపణలు గుప్పించింది.

అన్న క్యాంటీన్ లను మూసివేసి ఆ స్థానంలో రాజన్న క్యాంటీన్ లను నిర్వహించాలనే ఆలోచన వై సీపీ ప్రభుత్వానికి ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నా క్యాంటీన్ల స్థానంలో అవసరమైతే సంచార క్యాంటీన్ లను నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఇక వైసీపీ కీలక నేత విజయ సాయి రెడ్డి ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకే చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని ఆరోపణలు గుప్పించారు.

<strong>టీడీపీ, వైసీపీ దొందూ దొందే ... బీజేపీ నేత , నటి కవిత ఆసక్తికర వ్యాఖ్యలు </strong>టీడీపీ, వైసీపీ దొందూ దొందే ... బీజేపీ నేత , నటి కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నా క్యాంటీన్ లలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు .. పేదల భోజన పథకంపై ఆరోపణలు సరికాదన్న టీడీపీ

అన్నా క్యాంటీన్ లలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు .. పేదల భోజన పథకంపై ఆరోపణలు సరికాదన్న టీడీపీ

అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ట్వీట్ చేశారు. టీడీపీ అవినీతి చివరకు పేదలకు భోజనం పెట్టే పథకంలో కూడా సాగిందని ఆరోపించిన ఆయన పేదవాళ్లకు అతి తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి . రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయిందంటూ లెక్కలు చూపారని విజయసాయివిమర్శల వర్షం కురిపించారు. టిడిపి నేతలు ప్రతిదానిలోనూ కావాలనే వైసిపి అవినీతి ఆరోపణలు చేస్తుందని పేదవాళ్ల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ విషయంలో ఇది తగదని సమాధానం చెప్పారు.

 16న రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసనలు .. అప్పుడే కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేసిన బంగి అనంతయ్య

16న రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసనలు .. అప్పుడే కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేసిన బంగి అనంతయ్య

తాజాగా జరిగిన టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అన్న కాంటీన్ మూసివేత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టిడిపి నాయకులు. అన్న క్యాంటీ న్ల మూసివేత నిర్ణయానికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసన చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ధర్నాలతో పాటు పేదలకు అ ల్పాహార పంపిణీ చేపట్టాలని, దీక్షలు, ప్రదర్శనలు వంటివి చెయ్యాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిశ్చయించారు. అయితే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ప్రభుత్వంపై తన వినూత్న నిరసనను అప్పుడే మొదలెట్టేశారు. అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా మాజీ మేయర్ బంగి అనంతయ్య కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేశారు. అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు.

English summary
YCP alleged that the Ann canteens were set up by the Chandrababu government to entice the public before the election. that there was a Rs 150 crore scam in the construction of the canteens. The YCP government has shut down the canteen that the previous tdp government has set up to provide meals for five rupees to satisfy the poor. TDP has decided to stage a protest in front of canteens across the state on the 16th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X