వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ భారీ స్కెచ్.. చివరి ఐదు రోజులే టార్గెట్ !? వైసీపీ వ్యూహం ఏంటీ ?

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఇక‌, ప్ర‌చారం ఈ నెల 9వ తేదీ వ‌ర‌కే. స‌రిగ్గా ఇప్పుడే టిడిపి ఆట మొద‌లు పెట్టింది. పోలింగ్ కు ముందుగా ఓట‌ర్ల ఖాతాల్లో నేరుగా న‌గ‌దు జ‌మ అయ్యే విధంగా ప‌ధ‌కాల‌ను అమ‌లు చే స్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌..న‌వ ర‌త్నాల‌ను న‌మ్ముకున్న వైసిపి నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అయిదు రోజులు ఏపి ఎన్నిక‌ల పై ఏ మేర ప్ర‌భావం చూపిస్తాయ‌నే చ‌ర్చ మొద‌లైంది.

<strong>వైసిపి కి సినీ గ్లామ‌ర్‌ : టిడిపి..జ‌న‌సేన కి దూరం: కేసీఆర్ బెదిరింపులా...జూనియ‌ర్ ఎఫెక్టా..!</strong>వైసిపి కి సినీ గ్లామ‌ర్‌ : టిడిపి..జ‌న‌సేన కి దూరం: కేసీఆర్ బెదిరింపులా...జూనియ‌ర్ ఎఫెక్టా..!

వ‌రుస‌గా న‌గ‌దు జ‌మ‌లు..

వ‌రుస‌గా న‌గ‌దు జ‌మ‌లు..

స‌రిగ్గా పోలింగ్ కు ముందు ఓట‌ర్ల‌ను ఆకట్టుకొనేలా టిడిపి ముందుగానే వ్యూహాలు సిద్ద చేసుకుంది. ఈ నెల 11న పోలిం గ్‌..ఈ నెల 9న ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. ఇక, అధికారంలో ఉన్న టిడిపి వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనే విధంగా ప్ర‌ణాళిక సిద్దం చేసింది. ప్ర‌తీ నెలా ఇచ్చే సామాజిక పెన్ష‌న్లు ఈ నెల పంప‌కాలు ఇప్పటికే మొద‌ల‌య్యాయి. ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు పెన్ష‌న్ల పంపిణీ జ‌రుగుతుంది. ఈ నెల 4న ప‌సుపు - కుంకుమ కింద ఇప్ప‌టికే డ్వాక్రా మ‌హిళ‌ల కు ఇచ్చిన చెక్కుల‌ను క్యాష్ చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. చంద్ర‌బాబు సైతం ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే చె బుతూ వ‌స్తున్నారు. ఇక‌, ఆ వెంట‌నే రైతు రుణ మాఫీ పెండింగ్ ఉన్న నాలుగు..అయిదవ విడ‌త సొమ్మ‌ను నేరుగా రైతు ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఇక‌, ప్ర‌భుత్వం ఎన్నిక‌ల షెడ్యూల్ ముందు ప్ర‌క‌టించిన అన్న‌దాత సుఖీభ‌వ కార్య‌క్ర‌మం లో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో నాలుగు వేలు చొప్పున న‌గ‌దు జ‌మ చేయ‌నుంది.

అయిదు రోజుల పైనే టిడిపి ఆశ‌..

అయిదు రోజుల పైనే టిడిపి ఆశ‌..

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎంతో కొంత ప్ర‌భావం చూపుతుంద‌ని టిడిపి నేత‌లు అంగీక‌రిస్తున్నారు. అయితే, తాము చేస్తున్న సంక్షేమ ప‌ధ‌కాలు త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌నే న‌మ్మ‌కంతో టిడిపి నేత‌లు ఉన్నారు. అన్నింటి కంటే ఈ అయిదు రోజుల పాటు వ‌రుస‌గా రైతులు..డ్వాక్రా మ‌హిళ‌ల ఖాతాల్లో వ‌రుస‌గా జ‌మ అయ్యే న‌గ‌దు త‌మ‌కు ఓట్లు కురిపిస్తుంద‌ని టిడిపి చాలా ఆశ‌లు పెట్టుకుంది. ముందుగానే ఎన్నిక‌ల కోడ్ వీటి పై ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ముందు గానే అమ‌లు చేసే ప‌ద‌కాలు కావ‌టంతో ఎన్నిక‌ల సంఘం సైతం ఎటువంటి అభ్యంత‌రం చెప్ప‌ద‌నేది టిడిపి నేత‌ల అంచ‌నా. ఇదే స‌మ‌యంలో నిరుద్యోగ భృతి ని ఏడు జిల్లాల్లో రెండు వేల‌కు పెంచటాన్ని ఎన్నిక‌ల సంఘం అభ్యంత రం వ్య‌క్తం చేసింది. గ‌తంలో ఇచ్చిన వెయ్యి రూపాయాలు ఇవ్వ‌టానికి అనుమ‌తి ఇచ్చినా..రెండు వేలు ఇవ్వ‌టానికి మాత్రం అంగీక‌రించ‌లేదు.

వైసిపి..కిం క‌ర్త‌వ్యం...!

వైసిపి..కిం క‌ర్త‌వ్యం...!

ఇక‌, ప్ర‌చారం చివ‌రి అయిదు రోజుల్లో టిడిపి అధికారికంగా డ్వాక్రా మ‌హిళ‌లు..రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తున్న న‌గ‌దు ఏ మేర‌కు త‌మ ఓట్ల పై ప్ర‌భావం చూపుతుంద‌నే అంశం పై వైసిపి స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఎన్నిక‌ల కోడ్ ఉన్నా ముంద స్తుగానే అమ‌లు చేస్తున్న ప‌ధ‌కాలు కావటంతో ఎన్నిక‌ల సంఘం సైతం జోక్యం చేసుకొనే ప‌రిస్థితి క‌నిపించం లేదు. ఈ న‌గ‌దు జ‌మ ద్వారా టిడిపికి కొంతైనా మేలు జ‌రుగుతుంద‌ని వైసిపి సైతం అంచ‌నా వేస్తోంది. ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టి దాకా ఇవ్వ‌కుండా..ఇప్పుడు స‌రిగ్గా పోలింగ్ ముందు ఇవ్వ‌టం పైనా వ్య‌తిరేక‌త ఉంటుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. టిడిపి ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని న‌గ‌దు విడుద‌ల చేస్తోంద‌ని..ఎంత చేసినా చంద్ర‌బాబు పై ఉన్న వ్య‌తిరేక‌త మా త్రం త‌గ్గ‌ద‌న్న‌ది వైసిపి నేత‌ల అంచ‌నా. వైసిపి అధికారంలోకి వ‌స్తే రైతులు..డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అందే ప్ర‌యోజ‌నాల పై వారు ఆస‌క్తిగా ఉన్నార‌ని..ఇప్పుడు టిడిపి ఏం చేసినా...వైసిపికి అనుకూల ఓటింగ్ పై మాత్ర ప్ర‌భావం చూప‌ద‌ని వైసిపి నేత‌లు విశ్లేషిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ అయిదు రోజులు ఏం జ‌ర‌గ‌బోతోంది.. ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తుం ద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
AP election campaign is in high pitch. AP Govt strategically giving pensions..Farmer loan weaver, pasupu-kunkuma, Anna data sukhibhava amount in five days to bank accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X