వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ బిల్లులపై టీడీపీ యూటర్న్‌- కేంద్రం సవరణలు చేయాలన్న సోమిరెడ్డి

|
Google Oneindia TeluguNews

కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులపై పంజాబ్‌, హర్యానా, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో అన్నదాతలు నిరసనలకు దిగుతున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఈ నెల 8న భారత్‌ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. దీంతో రైతుల నిరసనల సెగ ఇప్పుడు అన్ని పార్టీలనూ తాకుతోంది. ముఖ్యంగా గతంలో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చిన టీడీపీ ఈ విషయంలో యూటర్న్‌ తీసేసుకుంది.

రైతుల ఆందోళనలకు మాజీ క్రీడాకారుల సంఘీభావం- అవార్డులు వెనక్కించేందుకు సిద్ధంరైతుల ఆందోళనలకు మాజీ క్రీడాకారుల సంఘీభావం- అవార్డులు వెనక్కించేందుకు సిద్ధం

ఢిల్లీలో రైతుల పోరాటంపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ 9 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారని, వారు ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్నారని సోమిరెడ్డి తెలిపారు. అధికారులు భోజన సౌకర్యం కల్పిస్తామన్నా నిరాకరించి పట్టుదలగా రైతులు ఉద్యమిస్తున్నారని సోమిరెడ్డి ప్రశంసించారు. కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ బిల్లులు తెచ్చిందో తెలియదు కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.

tdp takes u turn on agri laws, demands amendments to corporate bills

కార్పోరేట్‌ సంస్ధలు రైతులకు పెట్టుబడులు పెట్టి తిరిగి వారి ఉత్పత్తులను కొనే విషయంలో కనీస మద్దతు ధరకు కట్టుబడి ఒప్పందాలు చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. పేదల రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని కార్పోరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రైవేటు సంస్ధలు ఎంత సరుకైనా నిల్వ చేయవచ్చనే సౌలభ్యం వినియోగదారులకు భారంగా మారే ప్రమాదముందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన విధానంతో వ్యవసాయ బిల్లులకు కేంద్రం సవరణలు చేయాలని సూచించారు..

రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులతో వ్యవహరించి సత్వర నిర్ణయం తీసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. గతంలో వ్యవసాయ బిల్లులకు బేషరతుగా పార్లమెంటులో మద్దతు తెలిపిన టీడీపీ ఇప్పుడు సవరణలు ప్రతిపాదించడం ఆసక్తి కరంగా మారింది.

English summary
telugu desam party takes u turn on agri laws, which already passed in parliament. tdp leader somireddy proposed amendments to agri laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X