• search
  • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గులాబ్ తుఫాన్: జగన్ ప్యాలెస్ దాటి వస్తున్నాడా? హుదూద్ తుఫాన్ గుర్తు చేసి; చంద్రబాబు చేసింది చెప్పిన టీడీపీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రాంతం గులాబ్ తుఫాను ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతోంది. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వర్షాలు , వరదలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై పెద్దపెద్ద వృక్షాలు కూలిపోవడంతో రవాణా ఆగిపోయింది. పలు జలాశయాలు ప్రమాదకరస్థాయిలో పొంగిపొర్లుతున్న కారణంగా పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అధికార యంత్రాంగం ప్రజల ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

గులాబ్ తుఫాను ఎఫెక్ట్ .. ఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం ; ప్రమాద స్థాయిలో జలాశయాలు, స్తంభించిన జనజీవనంగులాబ్ తుఫాను ఎఫెక్ట్ .. ఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం ; ప్రమాద స్థాయిలో జలాశయాలు, స్తంభించిన జనజీవనం

తుఫాను సమయం .. చంద్రబాబుకు జగన్ కు ఉన్న తేడా చెప్పే పనిలో టీడీపీ

ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర లో గులాబ్ తుఫాను ప్రభావంతో వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతున్నా తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు రావడం లేదంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శలకు శ్రీకారం చుట్టింది. గతంలో చంద్రబాబు నాయుడు ఏపీలో చోటుచేసుకున్న భయానక హుదూద్ తుఫాను సమయంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పది రోజులు ఉండి మరీ సేవలు చేశారని గుర్తు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు కూడా రావడం లేదని చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఇదే అని చెబుతున్నారు.

నాడు హుదూద్ సమయంలో చంద్రబాబు పనితీరును గుర్తు చేస్తున్న టీడీపీ


ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూపించగలరా ! ఒక భీభత్సమైన తుఫాను వచ్చి ప్రజలు వణికిపోతూ ఉంటే అక్కడికి వెళ్లే వీలు లేకపోయినా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడి నుండి రాజమండ్రి, అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా వైజాగ్ కు అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారని వెంటనే ప్రజల మధ్యకు వెళ్లి, వారికి భరోసా ఇచ్చి, వారి కష్టాలు తీర్చి అక్కడే పది రోజులు మరి సహాయక చర్యలు చేపట్టేలాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా జీవనం కుదుటపడే దాకా వారితోనే ఉండి వచ్చిన నాయకుడు చంద్రబాబు అయితే జగన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు ఇంటికే పరిమితం అయినట్టు విమర్శిస్తున్నారు.

ఉత్తరాంధ్రపై గులాబ్ తుఫాను ఎఫెక్ట్ .. జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారని విమర్శ

నాడు హుదూద్ తుఫాను నీ సుందర నగరం ఎంత కకావికలైందో చూశావా అని విర్రవీగి తే ఇది నా సత్తా అంటూ ఆయన కష్టంతో ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చేసేలా చూసిన లీడర్ చంద్రబాబు అంటూ నాటి ఫోటోలను టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదే సమయంలో ఈ రోజు ఏం జరుగుతుంది? జగన్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి తన ప్యాలెస్ దాటి వస్తున్నాడా? ఉత్తరాంధ్ర ప్రజలారా గమనిస్తున్నారా ?అంటూ జగన్మోహన్ రెడ్డి వరదలతో ప్రజల కష్టాలు పడుతున్నా కనీసం అక్కడి ప్రజలకు నేనున్నానంటూ అండగా నిలబడటానికి రావడంలేదని, ప్రస్తుతం గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర ను వణికిస్తున్న సమయంలో, ప్రజల వద్దకు రాకుండా సమీక్షలకు పరిమితమవుతున్నారు అంటూ టిడిపి జగన్ ను టార్గెట్ చేస్తుంది.

భయానక తుఫాన్లు వచ్చినా జగన్ బయటకు రాడంటూ విమర్శలు

భయానక తుఫాన్లు వచ్చినా జగన్ బయటకు రాడంటూ విమర్శలు

రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎలాంటి పరిణామాలు అయినా, చివరకు రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న విపత్తులు అయినా సరే ప్రతి విషయంలోనూ జగన్ తీరును ఎండగడుతుంది టిడిపి. నాడు చంద్రబాబు నాయుడు పాలనను, నేడు జగన్ మోహన్ రెడ్డి తీరును ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తోంది. జగన్ సర్కార్ ఏ పని చేసినా అందులో వైఫల్యాలను, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనిని, ప్రస్తుతం జరుగుతున్న పాలనను పోల్చి చూపించి పదేపదే విమర్శిస్తున్నారు. వరదలు, భారీ వర్షాలు, భయానక తుఫాన్లు వచ్చినా జగన్ ప్రజా క్షేత్రంలోకి రారని పదేపదే విమర్శలు చేస్తోంది టీడీపీ.

గులాబ్ తుఫాను.. ప్రజలకు సాయం చెయ్యాలన్న చంద్రబాబు

గులాబ్ తుఫాను.. ప్రజలకు సాయం చెయ్యాలన్న చంద్రబాబు

ఇప్పటికే గులాబ్ తుఫాను నేపధ్యంలో బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాలుగా అండగా నిలవాలని చంద్రబాబు సూచించారు. సహాయక చర్యల్లో తెలుగు తమ్ముళ్ళు సైతం ముందువరుసలో ఉండాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో తుఫాను ప్రభావం పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు,లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి అవసరాలను తీర్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

English summary
TDP targets Jagan on Cyclone Gulab, reminded Chandrababu administration in hudhud cyclone days. TDP says Chandrababu went to visakha and stayed for 10 days to help cyclone victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X