'అప్పుడు ఓ జగన్ బచ్చా': ఆ ఇద్దరి టార్గెట్ వైయస్!

తెలంగాణ పైన వైయస్ రాజశేఖర రెడ్డి సభలోనే చెప్పారన్నారు. తెలంగాణ ఇవ్వాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలని ఢిల్లీకి పంపించారని ఆరోపించారు. నిన్నటిదాకా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు విభజన బిల్లుపై ఓటింగ్ అంటోందని, ఇందులో తిరకాసేమిటో అని ప్రశ్నించారు. జగన్ పార్టీ ఊసరవెల్లిని మించిపోయిందని మండిపడ్డారు.
వైయస్‌కు టిటిడిపి థ్యాంక్స్
తెలంగాణకు బీజం వేసింది వైయస్ అని, అందుకు ఆయనకు తాము థ్యాంక్స్ చెబుతున్నామని టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తామని వైయస్ చెప్పారని, అది జగన్, ఆయన పార్టీ తెలుసుకోవాలన్నారు. వైయస్ సభలో చెప్పినప్పుడు జగన్ బచ్చా అని, విజయమ్మ ఇంట్లో ఉన్నారన్నారు. వైయస్ నిర్ణయానికి కట్టుబడి జగన్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉండాలన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందంలో భాగంగానే జగన్ జైలు నుండి బయటకు వచ్చి తెలంగాణలో జెండా ఎత్తేశారని విమర్శించారు. ఆ పార్టీ మాట మీద నిలబడదన్నారు. మొదటి నుండి తెలంగాణపై మాట మార్చుతోందని మండిపడ్డారు. బిల్లు పైన ఓటింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తెరాస రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతోందని, డబ్బు సంచులకు అమ్ముడు పోవద్దని హితవు పలికారు.
పశ్చిమ బెంగాల్ విడిపోయినప్పుడు దానిని బంగ్లాదేశ్‌లో కలపాలని తీర్మానం చేశారని, అది కలిసిందా అని ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. కిరణ్, విజయమ్మ, పయ్యావుల కేశవ్.. ఎవరైనా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. ఓటింగ్ అంటే తెలంగాణ ప్రాంత నేతలమంతా కలిసి వ్యతిరేకిస్తామన్నారు. కిరణ్ చర్చ పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications