• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ బహిష్కరణ బాటలో చంద్రబాబు -అసెంబ్లీ బడ్జెట్ భేటీకి టీడీపీ దూరం -జగన్ సర్కారు కూలుతుందనే..

|

స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశల్లో అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లుగా పోరాడిన ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు.. పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని చవిచూడటంతో పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వివాదాల నేపథ్యంలో వాటిని అక్రమంగా పేర్కొంటూ టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు బహిష్కరణ బాటపట్టారు..

షాక్: జగన్‌కు చర్చి, మసీదు కనపడవా -హిందూ ఆలయాల్లో కొవిడ్ సెంటర్లపై టీడీపీ,బీజేపీ వ్యతిరేకత,విమర్శలుషాక్: జగన్‌కు చర్చి, మసీదు కనపడవా -హిందూ ఆలయాల్లో కొవిడ్ సెంటర్లపై టీడీపీ,బీజేపీ వ్యతిరేకత,విమర్శలు

బడ్జెట్ భేటీకి టీడీపీ దూరం..

బడ్జెట్ భేటీకి టీడీపీ దూరం..

వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం మార్చిలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడుతూరాగా, మూడు నెలల కాలానికి బడ్జెట్ ప్రతిపాదనలను జగన్ సర్కారు ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించుకుంది. అయితే, చివరి అసెంబ్లీ సమావేశం జరిగి ఆరు నెలలు కావొస్తున్నందున కచ్చితంగా సభ భేటీకావాల్సి ఉండటం, బడ్జెట్ కూడా ఆమోదించుకోవాల్సి ఉండటంతో కరోనా విలయంలోనూ షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 20(గురువారం) నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఆరోజే బీఏసీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయిస్తారు. మొత్తం రూ. 2.38లక్షల విలువైనదిగా భావిస్తోన్న బడ్జెట్ ను జగన్ సర్కారు ఆమోదించుకోనుంది. అయితే, ఈ బడ్జెట్ భేటీని బహిష్కరిస్తూ ప్రతిపక్ష టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది..

విజయన్ సంచలనం: అల్లుడికి అందలం -కేరళ కొత్త మంత్రులు వీరే -శైలజకు షాక్ -స్పీకర్‌గా ఎంబీ రాజేశ్విజయన్ సంచలనం: అల్లుడికి అందలం -కేరళ కొత్త మంత్రులు వీరే -శైలజకు షాక్ -స్పీకర్‌గా ఎంబీ రాజేశ్

ప్రభుత్వం కూలిపోతుందనే..

ప్రభుత్వం కూలిపోతుందనే..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మంగళవారం ప్రకటించారు. తూతూమంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని ఆయన స్పంష్టం చేశారు. ఆరు నెలల్లోపు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతోనే జగన్ సర్కారు అసెంబ్లీని ఏర్పాటుచేసిందేతప్ప, ఇందులో ప్రజాప్రయోజనాలేవీ లేవన్నారు. జగన్ సర్కారు ప్రతిపాదించిన రూ.2.11లక్షల బడ్జెట్ పై విపులంగా చర్చ జరగాల్సి ఉండగా, కేవలం ఒకరోజులోనే సమావేశాలను కానివ్వాలనుకోవడాన్ని అచ్చెన్న తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వింత మనిషి అని అచ్చెన్న విమర్శించారు. మరోవైపు..

జగన్‌కు కరోనా కనిపించట్లేదా..

జగన్‌కు కరోనా కనిపించట్లేదా..

సర్కారు కూలిపోతుందన్న ఆందోళనతో ఒక్కరోజులో మొక్కుబడిగా నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు తాము హాజరుకాబోమని ఏపీ టీడీపీ చీఫ్, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా, మండలిలో ప్రతిపక్ష నేత, టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా యాక్టివ్‌ కేసులు భారీగా ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారు? మార్చిలో కేవలం 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదు?'' అని యనమల ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించి, కరోనా కట్టడిలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎడగడతామని టీడీపీ నేతలు చెప్పారు.

English summary
as jagan govt announces assembly session dates to to approve AP Budget for 2021-22, the opposition TDP has decided to boycott the upcoming budget session. ap tdp chief and TDLP deputy leader Atchannaidu said that Jagan govt is holding name sake budget session for a day out of fear that his government will collapse if Assembly session is not conducted within a gap of six months as per Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X