వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ అధికార టిడిపికి కలిసివచ్చింది. నువ్వా..నేనా నే రీతిలో ఎన్నికల ఫలితాలు ఉంటాయని భావించినా నంద్యాల ఓటర్లు మాత్రం ఏకపక్షంగానే తీర్పు ఇచ్చారు. వైసీపీకి గట్టిపట్టున్న ప్రాంతాల్లో కూడ టిడిపి ప్రభంజనం కన్పించింది.వైసీపీకి నంద్యాల ఓటర్లు కోలుకోలేని దెబ్బ కొట్టారు.

''జగన్ చెప్పినట్టుగానే నంద్యాల తీర్పు, రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి''''జగన్ చెప్పినట్టుగానే నంద్యాల తీర్పు, రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి''

సాధారణంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం చూస్తాం. కానీ, దానికి భిన్నంగా నంద్యాల ఉప ఎన్నికల్లో 2014 సాధారణ ఎన్నికల కంటే అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది.

''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''

సాధారణ పోలింగ్ కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి కలిసివస్తోందోననే ఉత్కంఠకు తెరపడింది. ఓటర్లు ఏకపక్షంగానే తీర్పు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నంద్యాల: వ్రతం చెడ్డ ఫలితం లేదు, అంతర్మథనంలో వైసీపీనంద్యాల: వ్రతం చెడ్డ ఫలితం లేదు, అంతర్మథనంలో వైసీపీ

అన్ని అంశాలు టిడిపికి కలిసివచ్చాయనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. వైసీపీ చీఫ్ జగన్ 13 రోజుల పాటు ప్రచారం నిర్వహించినా కానీ, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గట్టెక్కించలేకపోయారు. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో కొంత ఇబ్బందికి గురిచేస్తున్నాయి.

భారీ ఓటింగ్ టిడిపికి కలిసి వచ్చింది.

భారీ ఓటింగ్ టిడిపికి కలిసి వచ్చింది.

ఉప ఎన్నికలో భారీ ఓటింగ్‌ శాతం టీడీపీకి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. కౌంటింగ్‌ మొదటి రౌండ్‌ నుంచి టీడీపీ ఆధిక్యత కనబరిచింది. ఒక్క 16వ రౌండ్‌లో తప్ప మిగతా అన్ని రౌండ్లలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పైచేయి సాధించారు. పెరిగిన ఓటింగ్‌ ఏ పార్టీకి కలిసొస్తుందో.. ఏ పార్టీకి నష్టం చేస్తుందో విశ్లేషకులు కూడా చెప్పలేని స్థితి ఉంది. కానీ వైసీపీ మాత్రం అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని, తమకే కలిసొస్తుందని భావించింది. కానీ ఓట్ల లెక్కింపులో సీన్‌ రివర్స్‌ అయింది. వైసీపీ తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమైంది. తమకు అనుకూలమైన గ్రామాలు, అనుకూలమైన వార్డుల్లో సైతం వైసీపీ వెనుకబడింది. వైసీపీకి పక్కాగా మెజార్టీ వస్దుందని భావించిన కేంద్రాల్లో సైతం టీడీపీ ఊహించని విధంగా మెజార్టీ సాధించింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడ సైకిల్‌దే హవా

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడ సైకిల్‌దే హవా

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడ టిడిపి హవా కన్పించింది. గోస్పాడు మండలంలో వైసీపీకి మెజారిటీ వస్తోందని భావించినా కానీ, ఆ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కలేదు. నంద్యాల అర్బన్‌లో మొత్తం 159 పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 1,42,628 ఓట్లకు గాను 1,05,484 ఓట్లు పోలై 73.96 పోలింగ్‌ శాతం నమోదైంది. నంద్యాల రూరల్‌లో మొత్తం 57 పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 47,386 ఓట్లకు గాను 41,512 ఓట్లు పోలై 87.60 పోలింగ్‌ శాతం నమోదైంది. గోస్పాడు మండలంలో మొత్తం 39 పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 28,844 ఓట్లకు గాను 26,193 ఓట్లు పోలై 90.81 పోలింగ్‌ శాతం నమోదైంది. నియోజకవర్గంలోని మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 2,18,858 ఓట్లకు గాను 1,73,189 ఓట్లు పోలై 79.13 పోలింగ్‌ శాతం నమోదైంది.

అంచనాలు తారుమారు

అంచనాలు తారుమారు

పెరిగిన ఓటింగ్‌ శాతంతో టీడీపీకి ఓటమి ఖాయమని వైసీపీ నాయకులు పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో బెట్టింగ్‌కు దిగేవారంతా వైసీపీ గెలుస్తుందంటకదా.. అన్న చర్చకు తెరలేపారు. ఈ ప్రచారాలతో టీడీపీ వర్గాల్లో సైతం ఎన్నికల ఫలితాలపై మొదట ఒకింత అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే ఓట్ల లెక్కింపు మొదలవ్వగానే అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. భారీ ఓటింగ్‌ శాతం టీడీపీకి అనుకూలంగా సాగిందని తేలిసోయింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ మెజార్టీని కట్టబెట్టినట్లు తేటతెల్లమైంది. పెరిగిన ఓటింగ్‌ శాతంతో వైసీపీ కోలుకోలేని విధంగా నష్టపోయింది.

గోస్పాడులో టిడిపికి 814 ఓట్ల ఆధిక్యం

గోస్పాడులో టిడిపికి 814 ఓట్ల ఆధిక్యం


గోస్పాడు మండలంలో 8 నుంచి 12 వేల మెజార్టీ వస్తుందని వైసీపీ నాయకులు అంచనా వేస్తూ వచ్చారు.కానీ, గోస్పాడు మండలంలో వైసీపీ ఆశలు నీరుగారాయి. ఈ మండలం నుండి టిడిపికి 814 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి గోస్పాడు మండలం నుండి మూడువేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతోనే భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. భూమా టిడిపిలోకి వచ్చినా క్యాడర్ మాత్రం వైసీపీలోనే ఉందనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. అయితే గోస్పాడు మండలంలో టిడిపి నాయకత్వం వ్యూహత్మకంగా వ్యవహరించింది.దీంతో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది.

English summary
The ruling Telugu Desam Party (TDP) in Andhra Pradesh won the by-election to the Nandyal assembly constituency in Kurnool district by a huge margin of 27,466 votes over the YSR Congress, its closest rival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X