వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అనిల్ పై అనుచిత వ్యాఖ్యలు: వరద బాధితుల ముసుగులో..: సోషల్ మీడియాలో రచ్చ (వీడియా)..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో వదర రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. అధికార వైసీపీ పైన బురద చల్లేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కొత్త వీడియోలు పోస్ట్ చేసారు. అందులో వరద బాధితుల రూపంలో నాడు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచార ప్రకటనల కోసం నటించిన పెయిడ్ ఆర్టిస్టులంటూ వారి తీరును బయట పెడుతున్నారు. ఇదే సమయంలో ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయించేందుకు ఈ రకంగా టీడీపీ వ్యవహరిస్తోందంటూ వైసీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం వరద రాజకీయాల్లో కొత్త టర్న్ కు కారణమైంది.

వరద బాధితుల ముసుగులో..

వరద బాధితుల ముసుగులో..

తాజాగా రాజధాని జిల్లాల్లో వచ్చిన వరద కారణంగా అనేక లంక గ్రామాలు..ప్రాంతాలు నీట మునిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వరద ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో బాధితులను పరామర్శించారు. ఇది సహజ సిద్దంగా వచ్చిన వరదలు కావని..వైసీపీ ఉద్దేశ పూర్వకంగా అమరావతిని ముంచేందుకు తెచ్చిన వరదలంటూ ఆరోపించారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. మంత్రులు వరద సహాయ చర్యలను వదిలేసి తన ఇంటి చుట్టూ తిరిగారని ఎద్దేవా చేసారు. తన ఇంటి గురించి తాను చూసుకుంటానని..మంత్రులకు ఎందుకు అంత బాధ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో క్రిష్టా నదీ పరివాహక ప్రాంతాల్లో చంద్రబాబు రెండో రోజు పర్యటన సాగుతోంది. ఇదే సమయంలో రాజధాని గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. సహాయ కార్యక్రమాలకు అడ్డు రాకూడదనే తాను వరదలు రాగానే రాలేదని చెబుతూనే..చేతికి గాయం కారణంగా తాను హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్నానని మరో ప్రాంతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. దీనికి ధీటుగా వైసీపీ మంత్రులు సైతం స్పందించారు. ఇక, ఇదే సమయంలో వరద బాధితుల ముసుగులో కొందరు చేసిన హడావుడిని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు.

బాధితులుగా పెయిడ్ ఆర్టిస్టులు..

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం టీడీపీ పేయిడ్ ఆర్టిస్టులు వరద బాధితుల ముసుగులో ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ కొన్ని ప్రకటనలను పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చిత్రీకరించింది. వాటిని టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం చేసారు. అందులో అప్పుడు టీడీపీ ప్రకటనల కోసం నటించిన పెయిడ్ ఆర్టిస్టులే ఇప్పుడు పలు ప్రాంతాల్లో వరద బాధితుల రూపంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి..వైసీపీ పాలన పైనే వారు ఎక్కువగా ఆరోపణలు చేసారు. తమక ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందటం లేదన్నది వారి వ్యాఖ్యల సారాంశం. అయితే, వైసీపీ శ్రేణులు వీరి గురించి ఆసక్తి కర విషయాలను బయటకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలను బయట పెట్టారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

మంత్రి అనిల్ పైన అనుచిత వ్యాఖ్యలు..

మంత్రి అనిల్ పైన అనుచిత వ్యాఖ్యలు..

వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం మేరకు..వారు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు, వారు అదే సమయంలో మంత్రి అనిల్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తన్న వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఇరిగేషన్ శాఖా మంత్రిగా గొర్రెలు కాచుకొనే అనిత్ యాదవ్..అంటూనే అనుచిత వ్యాఖ్మలను మరిన్ని చేసారు. దీంతో..సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. చివరకు వరద సహాయ చర్యల్లో వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారంటూ వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. అయితే, దీని పైన టీడీపీ శ్రేణులు స్పందించాల్సి ఉంది..

English summary
TDP used paid artists as flood victims to conrner YCP govt in releif meausres. YCP cadre trolling this viedos in social media. Now this issue became viral in Telugu politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X