వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ సీట్లలో వల్లభనేని వంశీ: సభలోనే చంద్రబాబు ఎదుటే: అదే బాటలో ఆ ఇద్దరూ..!

|
Google Oneindia TeluguNews

వల్లభనేని వంశీ సీటు మారింది. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ నుండి సస్పెండ్ అయిన వంశీ వైసీపీ సీట్లలో కనిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మందు..ఆయన టీడీపీ నిర్ణయాలకు భిన్నం గా అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించారు. దీంతో ఆయన్ను ఆ సమయంలో పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఆ తరువాత శీతాకాల సమావేశాల్లో ఆయన సభలోనే స్పీకర్ ను తన సీటు గురించి అభ్యర్ధన చేసారు. తనను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేసారో తెలియదని..తాను కూడా ఇక టీడీపీతో ఉండలేనని చెప్పుకొచ్చారు. తనకు ఆ పార్టీతో సంబంధం లేకుండా టీడీపీ సీట్లలో కాకుండా..మరో చోట సీటు కేటాయించాలని అభ్యర్ధించారు. అదే సమయంలో స్పీకర్ సానుకూలంగా స్పందించారు. వంశీ అభ్యర్ధన మేరకు అవకాశం ఉన్న చోట సీటు కేటాయించాలని శాసనసభా కార్యదర్శిని స్పీకర్ ఆదేశించారు. ఇక, ఈ రోజు సభలో వంశీ సీటు మారింది. ఆయన కు సభ కేటాయించిందా..లేక ఆయనే కూర్చుున్నారా అనేది తేలాల్సి ఉంది.

అధికార పార్టీ సీట్లలో వంశీ...
గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఈ రోజు కొత్త సీట్లో కనిపించారు. గతంలో ఆయన చేసిన అభ్యర్ధన మేరకు అవకాశం ఉన్న చోట సీటు కేటాయించాలని స్పీకర్ ఆదేశించారు. రాజధానుల వ్యవహారం మీద మూడు రోజు ల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. తొలి రోజు టీడీపీ వరుసలోనే కూర్చున్న వంశీ..ఈ రోజు మాత్రం అధికార పార్టీ బెంచ్ ల్లో ఆసీనులయ్యారు. తొలి రోజు వంశీ టీడీపీ వరుసలో చివరి బెంచ్ లో కూర్చోగా..ఆయనతో పాటే టీడీపీతో విభేదించి వైసీపికి దగ్గరయిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిర సైతం ఆయన పక్కనే కూర్చుకున్నారు. ఈ సమావేశాలకు తప్పని సరిగా హాజరు కావాలని.. టీడీపీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని టీడీపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అందులో భాగంగానే..ఈ ఇద్దరికీ విప్ లు జారీ చేసింది. వీరిద్దరూ సభకు హాజరైనా.. చర్చలో పాల్గొనే అవకాశం.. ఓటింగ్ లేకుండా బిల్లు ఆమోదం పొందింది.

TDP Vamsi seated in YCP benches..suspedned from party

ఆ ఇద్దరూ అదే రూటులో...
ఇక, వంశీ బాటలోనే ఇప్పటికే టీడీపీని వ్యతిరేకించిన మద్దాలి గిరి అడుగులు వేస్తున్నారు. ఇక, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వ్యవహరిం చాలని స్వయంగా పార్టీ అధినేత ఆదేశించారు. అయితే, సభలో అందుకు భిన్నంగా రాపాక వ్యవహరించటంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు రాపాక సైతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేతో కలిసే అవకాశం కనిపిస్తోంది.

English summary
TDP rebel Mla Vallabhaneni Vamsi seated in YCP benches in Assembly. After TDP suspended him he closely moviing with YCP. As per offcial records Vamsi continue as TDP Mla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X