వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాబీలో హోదాపై బీజేపీ ట్విస్ట్, పాయింట్ లాగిన టీడీపీ: టీడీపీ మనసులో మాట అంటూ..

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. మరోవైపు, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాల్లో సైకిల్ వర్సెస్ కమలంగా కనిపించనుంది.

Recommended Video

Parliament Budget session :TDP MPs protest, Amit Shah to Meet MPs

సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 17 రోజుల పాటు నిర్వహిస్తారు. అప్పుడే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ సాగింది.

అనలేదంటూ అసలు అజెండా: కేసీఆర్-బాబు దోస్తీ వెనుక మోడీ! జగన్‌కు రివర్స్అనలేదంటూ అసలు అజెండా: కేసీఆర్-బాబు దోస్తీ వెనుక మోడీ! జగన్‌కు రివర్స్

ప్రత్యేక హోదాపై కౌంటర్

ప్రత్యేక హోదాపై కౌంటర్

ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారన్న టీడీపీ వ్యాఖ్యలపై ఆకుల స్పందిస్తూ.. హోదా పేరున కాకుండా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు కేంద్రం కొన్ని రాష్ట్రాల్లో నిధులు కేటాయించిందని చెప్పారు.

హోదా కూడా గతంలో ఇచ్చిందే కదా

హోదా కూడా గతంలో ఇచ్చిందే కదా

దానికి టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ.. ప్రత్యేక హోదా కూడా గతంలో ఇచ్చిన హామీనే అని, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా దానిని పరిగణించాలని చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లిన వాటినే కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇస్తోందని విమర్శించారు.

మా నీళ్లు అని అనవచ్చా

మా నీళ్లు అని అనవచ్చా

దీనికి ఆకుల ధీటుగా స్పందించారు. మా గోదావరి నీళ్లను కృష్ణా, గుంటూరు తీసుకు వెళ్లాయని మేం అనగలమా అని ప్రశ్నించారు. దానికి రాజేంద్ర ప్రసాద్ కౌంటర్ ఇస్తూ.. జాతీయ పార్టీ నేతలు ఇలా ఉప ప్రాంతీయ స్థాయిలో ఆలోచనలు చేయవద్దన్నారు. బీజేపీ కాళ్లపై టీడీపీ నడుస్తోందన్న రీతిలో మీరు మాట్లాడుతున్నారని చెప్పారు.

టీడీపీ నేతలు మనసులో మాట బయటపెట్టారు

టీడీపీ నేతలు మనసులో మాట బయటపెట్టారు

దానికి అక్కడే ఉన్న విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ.. టీడీపీ నేతలు మనసులోని మాటను బయట పెట్టారన్నారు. టీడీపీ వలే మేం అవాస్తవాలు చెప్పలేమన్నారు. కాగా, అసెంబ్లీలో ఏపీకి ఇచ్చిన అన్నింటిని లెక్కలతో సహా చెప్పాలని బీజేపీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

English summary
TDP leader Rajendra Prasad versus BJP leaders Vishnu Kumar Raju and Akula Satyanarayana in Assembly lobby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X