వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ స్వగ్రామంలో వైసీపీ జెండా - జగన్ ఇలాకాలో జడ్పీటీసీ టీడీపీదే : దేవినేని ఉమా ఇలాకాలో ఫ్యాన్ గాలి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. టీడీపీ తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా..అనేక చోట్ల బ్యాలెట్ పేపర్ల మీద టీడీపీకి ఓట్లు పడ్డాయి. దీంతో..వైసీపీ నేతలు మాత్రం టీడీపీ వాదనను ఖండిస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఓడిపోతామనే విషయం తెలిసి బహిష్కరించామని చెబుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఈ రోజు వెలువడుతున్న ఫలితాల్లో ఆసక్త కర రిజల్స్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరు లో వైసీపీ గెలిచింది.

ఎన్టీఆర్ స్వగ్రామంలో వైసీపీ జెండా

ఎన్టీఆర్ స్వగ్రామంలో వైసీపీ జెండా

నిమ్మకూరు గ్రామం క్రిష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం లో ఉంది. ఆ గ్రామ ఎంపీటీసీ వైసీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరును నారా లోకేష్‌ దత్తత తీసుకోగా, ఆయనను ప్రజలు విశ్వసించలేదు. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ పామర్రు నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2009లో కాంగ్రెస్ గెలిస్తే, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ దాదాపు 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఉమా సొంత మండలంలో వైసీపీ గెలుపు

ఉమా సొంత మండలంలో వైసీపీ గెలుపు

ఇదే జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా సొంత నియోకవర్గం..ఉమా ఇలాకా లో వైఎస్సార్‌సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్‌సీ కైవసం చేసుకుంది. వీరి సంగతి ఇలా ఉంటే..టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

సీఎం జిల్లాలో ఖాతా తెరిచిన టీడీపీ

సీఎం జిల్లాలో ఖాతా తెరిచిన టీడీపీ

ఇక, మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ గెలిచింది. అక్కడ జేసీ ప్రభాకర రెడ్డి పార్టీతో పాటుగా తన టీంను గెలిపించుకొని..మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీకి ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో ఒకటే జెడ్పీటీసీ గెలుచుకుంది. అది కూడా సీఎం సొంత జిల్లాలో గెలిచింది. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గోపవరం జడ్పీటిసి స్థానంలో అభ్యర్థి జయరామిరెడ్డి
104 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ అభ్యర్ది డాక్టర్ జీ వెంకట సుబ్బయ్య కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో మరణించారు.

Recommended Video

AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
ఫలితాల పైన రెండు పార్టీల డైలాగ్ వార్

ఫలితాల పైన రెండు పార్టీల డైలాగ్ వార్

అయితే, ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వైసీపీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. దీంతో..ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల మేరకు సీఎం జగన్ సొంత జిల్లాలోని ఒక జెడ్పీటీసీ ని మాత్రమే టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ ఓటమి పైన వైసీపీ విశ్లేషణ చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
Intereting results in ZPTC and MPTC elections counting. YSRCP won the MPTC of NTR own village Nimmakur and TDP won the ZPTC in CM Jagan own district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X