వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేశ్ మార్షల్ పీక పట్టుకున్నారు..: చంద్రబాబు..ఆ పత్రిక పైన కొడాలి ఫైర్: వీడియో ప్రదర్శన..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019 : TDP vs Marshals Issue : ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబూ...!

టీడీపీ సభ్యులు అసెంబ్లీ మార్షల్స్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపైన అసెంబ్లీలో వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని..సభ్యులు కాని వారితో కలిసి లోపలకు వచ్చే ప్రయత్నం లో మార్షల్స్ అడ్డుకున్నారని..ఆ సమయంలో టీడీపీ నేతల ప్రవర్తన గురించి వైసీపీ సభ్యులు మండిపడ్డారు. మార్షల్ ను ఎమ్మెల్సీ లోకేశ్ పీక పట్టుకొని తోసేసే ప్రయత్నం చేసారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు.

అదే విధంగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి..ఎమ్మెల్సీ రామా నాయుడు సైతం దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతలు విమర్శించారు. ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు టీడీపీలో చొరబడ్డారంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బయట గొడవ చేసి..సభలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఒక వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారని చెప్పుకొచ్చారు. మంత్రి బుగ్గన సైతం మార్షల్స్ పైన టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును వివరిస్తూ..వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

లోకేశ్ మార్షల్ పీక పట్టుకొని..ఇలా

లోకేశ్ మార్షల్ పీక పట్టుకొని..ఇలా

టీడీపీ నేతలు..ఎమ్మెల్యేలు కాని వారు సైతం ర్యాలీగా శాసనసభలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మార్షల్స్ అడ్డుకున్నారని ..అసభ్యంగా తిట్టారని..ఆయనతో పాటుగా అనుచితంగా వ్యవహరించిన టీడీపీ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంలోని మంత్రులు..సభ్యులు డిమాండ్ చేసారు. అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నేతలను మార్షల్స్ ను అడ్డుకున్న సమయంలో చోటు చేసుకున్న సన్నివేశాలను సభలో వీడియో ద్వారా ప్రదర్శించారు.

ఆ సమయంలో ఎమ్మెల్సీలు లోకేశ్..దీపక్ రెడ్డి..ఎమ్మెల్యే రామానాయుడు మార్షల్స్ పైన దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఒక మార్షల్ పైన ఎమ్మెల్సీ లోకేశ్ పీక పట్టుకొని దాడికి ప్రయత్నించారని..ఆయనతో సహా దాడికి ప్రయత్నించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మార్షల్స్..టీడీపీ సభ్యుల మధ్య జరిగిన తోపులాట..గొడవను సభలో వీడియో ద్వారా ప్రదర్శించారు. లోకేశ్ అసెంబ్లీ మార్షల్స్ మీద సీరియస్ అయిన వ్యాఖ్యలను చూపించారు.

టీడీపీ..ఆ పత్రికపైన మంత్రి కొడాలి ఫైర్..

టీడీపీ..ఆ పత్రికపైన మంత్రి కొడాలి ఫైర్..

మంత్రి కొడాలి నాని చంద్రబాబు అదే విధంగా ఒక దిన పత్రిక మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు టీడీపీలో చేరిన పందికొక్కు అంటూ..పరుషంగా మాట్లాడారు. ఆయన పార్టీలో చేరి వ్యవస్థను నాశనం చేసారని ఫైర్ అయ్యారు. బయట డ్రామాలు ఆడి..సభలోకి వచ్చి నటిస్తున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా చంద్రబాబు గురువారం సభలో ఒక దిన పత్రిక గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ పత్రిక
టీడీపీ కంటే ముందుగా ప్రారంభమైనా..ఆ పత్రికకు ఎన్టీఆర్ ఉపయోగపడ్డారని..ఎన్టీఆర్ మాత్రం ఆ పత్రికను ఉపయోగించుకోలేదని చెప్పుకొచ్చారు.

జగన్ పైన కేసులు ఉన్నాయనే సంగతి ప్రజలకు తెలుసని.. ఆయన ఒక వ్యక్తిగా మొదలై..వ్యవస్థగా ఎదిగారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అధినేత వద్ద మెప్పు కోసం టీడీపీ నేతలు పోటీ పడి మార్షల్స్ తో దారుణంగా వ్యవహరించారని..ఆ సమయంలో కరణం బలరాం సైతం వారిని వారించే ప్రయత్నం చేసారని..వారి పైన చర్యలు తీసుకోవాలని పేర్ని నాని సభాపతిని కోరారు.

చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని..

చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని..

ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఆర్దర్ సైతం టీడీపీ తీరును తప్పు బట్టారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొన్నారని చంద్రబాబు పైన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో స్పీకర్ నారాయణ రావు వ్యవహరించిన తీరుగానే ఇప్పుడు స్పీకర్ వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదే విధంగా గతంలొ చీఫ్ మార్షల్ గా పని చేసిన ఎమ్మెల్యే ఆర్దర్ సైతం మార్షల్స్ ఉన్నది సభ్యులు..సభా భద్రత కోసమేనని..వారి పైన దరుసుగా వ్యవహరించటం సరి కాదని పేర్కొన్నారు. మంత్రి బుగ్గన..అసలు ఏం జరిగిందనే విషయాన్ని వివరించి..సభలో వీడియోలు ప్రదర్శించాలని కోరారు. దీంతో..సభలో వీడియోలు ప్రదర్శించారు.

English summary
TDP vs marshal issue hit Ap Assembly. In plae question hour Govt raised this matter and presented Video regarding this issue. Demanded for action against TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X