వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్డోడా.. చెప్పుతో కొడతామంటారా ... మంత్రులను రౌడీలంటారా .. మండలిలో టీడీపీ వర్సెస్ వైసీపీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో నిన్నటి సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది . ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్సీలు , వైసీపీ మంత్రుల మధ్య డిష్యూం డిష్యూం కొనసాగుతుంది . శాసన మండలిలో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై మంత్రులు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు . మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి , అలాగే వైవీబీ రాజేంద్రప్రసాద్ ఈరోజు శాసనమండలిలో అసహనం వ్యక్తం చేశారు.

చెప్పుతో కొడతామన్నారు .. గుడ్డోడా కూర్చో అన్నారు : టీడీపీ ఎమ్మెల్సీల ఫిర్యాదు

చెప్పుతో కొడతామన్నారు .. గుడ్డోడా కూర్చో అన్నారు : టీడీపీ ఎమ్మెల్సీల ఫిర్యాదు

చెప్పుతో కొడతామంటూ అధికార పక్షం నేతలు బెదిరిస్తున్నారు అంటూ మండలి దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి . శాసన మండలికి మంత్రులు సమాధానాలు ఇవ్వడానికి రావాలి కానీ, తన్నడానికి వస్తారా అంటూ ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. ఇక ఇదే సమయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిన్న శాసనమండలిలో తనను మంత్రి గుడ్డోడా కూర్చో అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ సభాపర్వం .. కీలకబిల్లులపై నేడు చర్చ.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని టీడీపీ సభ్యుల వాకౌట్ఏపీ సభాపర్వం .. కీలకబిల్లులపై నేడు చర్చ.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని టీడీపీ సభ్యుల వాకౌట్

మంత్రి వెల్లంపల్లిపై చర్యలకు డిమాండ్ .. రికార్డులు పరిశీలిస్తామన్న డిప్యూటీ చైర్మన్

మంత్రి వెల్లంపల్లిపై చర్యలకు డిమాండ్ .. రికార్డులు పరిశీలిస్తామన్న డిప్యూటీ చైర్మన్

నిన్నటి నుండి మంత్రిని క్షమాపణ చెప్పాలని నిరసన తెలుపుతున్నా ఇప్పటివరకు మంత్రి నుండి సమాధానం రాలేదని ఆయన పేర్కొన్నారు. మంత్రి వెల్లంపల్లి పై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
టిడిపి ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకుడిప్యూటీ చైర్మన్రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు.రికార్డులు చూసిచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై అటు వైసీపీ మంత్రులు సైతం మండిపడ్డారు.

మంత్రులను వీధి రౌడీలంటారా ? వైసీపీ మంత్రి బొత్సా రివర్స్ అటాక్

మంత్రులను వీధి రౌడీలంటారా ? వైసీపీ మంత్రి బొత్సా రివర్స్ అటాక్

మంత్రులను రౌడీలని టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా సంబోధిస్తారని ప్రశ్నించారు. బాధ్యత ఉన్న మంత్రులము రౌడీలమా అని ప్రశ్నించారు బొత్సా సత్యన్నారాయణ . ప్రతిపక్ష సభ్యుల కంట్రోల్ పెట్టకపోవడం సమంజసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు . మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలు కూడా వ్యక్తిగత విమర్శలకు దిగారని రికార్డులు పరిశీలించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ను కోరారు. మంత్రులకు, అధికార పక్ష సభ్యులకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరాఅని మంత్రి బొత్సప్రశ్నించారు.

దొడ్డి దారిన వచ్చిన నాయకులం కాదన్న బొత్సా

దొడ్డి దారిన వచ్చిన నాయకులం కాదన్న బొత్సా


ఏపీ శాసన మండలి లో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తనను వీధి రౌడీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్సీ లైన బుద్ధ నాగ జగదీశ్వరరావు, అంగర రామ్మోహన్ మంత్రుల పైకి దూసుకు వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మమ్మల్ని వీధి రౌడీలు అని టిడిపి సభ్యులు ఎలా అంటారు అని ఆయన ప్రశ్నించారు. తాము దొడ్డిదారిన రాలేదని, 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామంటూ ఇద్దరు మండిపడ్డారు.

మళ్ళీ సభలో గందరగోళం .. బొత్సా వర్సెస్ బుద్దా నాగ జగదీశ్వరరావు

మళ్ళీ సభలో గందరగోళం .. బొత్సా వర్సెస్ బుద్దా నాగ జగదీశ్వరరావు


టిడిపి సభ్యులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారు అంటూ విరుచుకు పడిన ఆయన సభలో ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు అన్నారు. ప్రభుత్వం తరఫున మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని బొత్స హెచ్చరించారు. ఇక బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో టిడిపి సభ్యుడు బుద్ధ నాగ జగదీశ్వర్ రావు మండిపడ్డారు. ఇరువురి మధ్య మళ్లీ వ్యక్తిగత దూషణలు కొనసాగాయి. ఒకరిపై ఒకరు దూసుకురావడంతో సభలో మళ్లీ గందరగోళ వాతావరణం నెలకొంది.

English summary
Yesterday's scene is being repeated in the Andhra Pradesh Legislature council. Even today the tussle between TDP MLCs and YCP ministers continues. TDP MLCs are incensed over the behavior of ministers in the Legislative Council. Ministers are cracking down on TDP MLCs at the same level. TDP MLC Deepak Reddy, as well as YVB Rajendra Prasad today expressed impatience in the legislature that the ministers were speaking at will. Minister botsa also outraged over tdp MLCs .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X