వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలి రద్దుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ... ఎవరి వాదన కరెక్ట్ ?

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను మండలి ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపటంతో మండలిని రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్ . ఇక ఈ నేపధ్యంలోనే మండలిని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక శాసనసభలో కేబినెట్ నిర్ణయానికి ఆమోద ముద్రపడటం తరువాయి . అయితే శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపినంత మాత్రాన ఇంతటితో మండలి రద్దు అయిపోదు అనే అంశం జోరుగా చర్చనీయాంశం అవుతుంది.

ఈ ఒక్కరోజే అసెంబ్లీ: మండలి రద్దుపైన తీర్మానం..చర్చ: కేంద్రానికి సిఫార్సు..బీఏసీలో నిర్ణయం..!ఈ ఒక్కరోజే అసెంబ్లీ: మండలి రద్దుపైన తీర్మానం..చర్చ: కేంద్రానికి సిఫార్సు..బీఏసీలో నిర్ణయం..!

 మండలి రద్దు తీర్మానం కేంద్రం కోర్టులో

మండలి రద్దు తీర్మానం కేంద్రం కోర్టులో

ఎందుకంటే మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి . దీనికి కేంద్రం నుండి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. రాష్ట్రాల స్థాయిలో ఇలాంటి చట్ట సభల ఏర్పాటుకు, రద్దుకు కేంద్రం ఆమోద ముద్ర తప్పనిసరి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయానికి కేంద్రంలో ఆమోదం లభిస్తుందా ? ఒకవేళ లభిస్తే ఎప్పటికి ఆమోదం లభిస్తుంది అన్నది ఇప్పుడు ఏపీలో ఆసక్తికర అంశంగా మారింది.

మండలి రద్దు అంత ఈజీ కాదంటున్న టీడీపీ

మండలి రద్దు అంత ఈజీ కాదంటున్న టీడీపీ

ఇక మండలి రద్దు అంత ఈజీ కాదని ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే తమ అభిప్రాయం వ్యక్తం చేశారు . ఒకరేమో ఆరు నెలలు పడుతుందంటే మరి కొందరు ఏడాది అంటున్నారు. ఇంకొందరు ఏడాదిన్నర అని మొదలుపెట్టి మూడేళ్ల సమయం పడుతుందని కూడా వ్యాఖ్యానించారు. మండలి రద్దు గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ సమయం పడుతుందని, అది అంత సాధ్యం కాదని కేంద్రం ఆమోద ముద్ర పడే వరకూ మండలి కొనసాగుతుంది అని చెప్తున్నారు .

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మండలి రద్దు తీర్మానం పెట్టాలని భావిస్తున్న వైసీపీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మండలి రద్దు తీర్మానం పెట్టాలని భావిస్తున్న వైసీపీ


మండలి రద్దు వల్ల తెలుగు దేశం పార్టీకి మాత్రమే కాదు వైసీపీకి సైతం ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడుతుంది. అలాంటప్పుడు మండలి రద్దు నిర్ణయం కరెక్ట్ కాదని టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి . అయితే ప్రభుత్వం ఆలోచన మాత్రం వేరేగా ఉందని అర్ధం అవుతోంది. అయితే త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ తీర్మానాన్ని పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తుంది. . అటు లోక్ సభ ఇటు రాజ్యసభ రెండూ సమావేశం కాబోతున్న కారణంగా ఆ సమావేశాల్లోనే ఏపీ మండలి రద్దు తీర్మానాన్ని పెట్టాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన అని చెప్తున్నారు .

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu
 పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ మండలి తీర్మానంపై నిర్ణయం ఎలా ఉంటుందో అన్న సందిగ్ధం

పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ మండలి తీర్మానంపై నిర్ణయం ఎలా ఉంటుందో అన్న సందిగ్ధం


ఆ ఆలోచనతోనే ఇప్పుడు మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ శాసనసభలో ఆమోదిస్తున్నారని సమాచారం . మరి ప్రభుత్వం అనుకున్నట్టుగా వచ్చే పార్లమెంట్ సమావేశాలతోనే మండలి రద్దుకు ఢిల్లీలో ఆమోద ముద్ర పడుతుందా, కేంద్రం రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తుందా లేక తెలుగుదేశం చెప్పినట్టుగా మండలి రద్దుపై ఎటూ తేల్చకుండా సుదీర్ఘ కాలం నాన్చివేత ధోరణి అవలంబిస్తుందా అనేది ఆసక్తికర అంశం .

English summary
CM YS Jagan Mohan Reddy cabinet said ok to dissolve the legislative council . The only question now is that when will Parliament, whose assent to the AP assembly resolution is absolutely necessary, give its nod. The TDP leaders say that it would not be all that easy. It could take six months or even one year, they argue. Some inveterate optimists say that it could take at least three years. Till then, the council would be in existence, they say. Now, this issue has become a hot topic of debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X