వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాప్తిపై టీడీపీ వర్సెస్ వైసీపీ.. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది . ఇక ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 164 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని దీంతో అటు ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. తమ సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్తుంది . ఈ క్రమంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వరుస లేఖలతో జగన్ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ చురకలు అంటిస్తే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వరుస ట్వీట్లు చేస్తూ అధికార పార్టీపై తీవ్ర విమర్శలుగుప్పించారు. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ అటు చంద్రబాబు , ఇటు నారా లోకేష్ లపై సెటైర్లు వేశారు .

 జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్

జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్

జగన్ గారు మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే రకం. ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం అని లోకేష్ లోకేష్ ప్రభుత్వ చర్యలపై ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు . అంతేకాదు కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదనీ వ్యాఖ్యానించారు లోకేష్ . గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్లకు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు.

 జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని విమర్శలు

జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని విమర్శలు

కాంట్రాక్టర్ల పై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా? అంటూ మండిపడ్డారు లోకేష్ .కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదనీ లోకేష్ వాఖ్యనించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్నిరాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని పేర్కొన్నారు.

కరోనా టెస్టుల విషయంలో బాబు వ్యాఖ్యలు .. మండిపడిన విజయ సాయి

కరోనా టెస్టుల విషయంలో బాబు వ్యాఖ్యలు .. మండిపడిన విజయ సాయి


ఇక చంద్రబాబు అందరికీ టెస్టులు చెయ్యటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అందుకే కరోనా వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు మార్లు లేఖలు రాసిన ఆయన రేషన్ కోసం జనాలను గుంపులుగా ఉండేలా చెయ్యటం మంచిది కాదని అన్నారు. ఇంటికే రేషన్ పంపాలని విజ్ఞప్తి చేశారు . ఇక దీని పైన ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు .
జగన్ ను విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల తీరును ఎండగట్టారు .హైదరాబాద్ లో స్టార్ హోటల్ కి చెల్లించిన బిల్లులు, పది కోట్ల ప్రత్యేక బస్సు (కారవాన్), హిమాలయ వాటర్ కు పెట్టిన ఖర్చుతో వెయ్యి వెంటిలేటర్లు వచ్చేవి. కొనాలన్నా వెంటనే లభ్యం కాని పరిస్థితి ఇప్పుడు వచ్చిందని ఆయన అన్నారు . ప్రజాధనాన్ని దుబారా చేసి మీ కర్మ-మీరు చావండని పారిపోయిన వ్యక్తి విజనరీ అంట అని నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి .

కరోనా లక్షణాలు కనిపిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండని సెటైర్లు

కరోనా లక్షణాలు కనిపిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండని సెటైర్లు

'కరోనా లక్షణాలు కనిపిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండి. కొత్తగా 3 కరోనా నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు సిఎం జగన్ గారు. క్వారెంటైన్ సౌకర్యాలు కూడా పెరిగాయి. అందరికి టెస్టులు చేయాలనే ఏడుపుగొట్టు సలహాలొద్దు. ఎవరికి పరీక్షలవసరమో వైద్య నిపుణులకు తెలుసు' అంటూ కౌంటర్ వేశారు. ఇక మరో పోస్ట్ లో ఏడాది కింద కరోనా వచ్చుంటేనా.. పచ్చ మీడియాను వెంటేసుకుని క్వారంటైన్ వార్డుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. డాక్టర్లను మందలించడం, నేను రాకపోతే పరిస్థితి ఏమిటని నిలదీయడాలు.. ఇలాంటి సిఎం మాకు లేడే అని మహారాష్ట్ర, కేరళ ప్రజలు శోకాలు పెట్టినట్టు ... ఆ వేషాలు చెప్పనలవి కాకుండా ఉండేవని విజయసాయి ఎద్దేవా చేశారు .

English summary
Responding to comments made by TDP chief chandrababu and his son nara lokesh that the government has failed to do corona tests, MP Vijayasai redddy said that the TDP would make unnecessary allegations and that corona tests would be carried out by those who need it. he targeted chandrababu and his son nara lokesh and said they need corona tests .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X