India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకివీడులో నువ్వా నేనా? టీడీపీ వర్సెస్ వైసీపీ; ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తున్నాయి. వైసిపి అధికార దుర్వినియోగంపై టిడిపి, టిడిపి నేతలు కుట్రలు చేస్తున్నారని వైసిపి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నగర పంచాయతీల ఎన్నికలు సాధారణ ఎన్నికల మాదిరిగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నగర పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు

టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు

పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీ కి ప్రతిష్టాత్మకంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో పాలకొల్లుతో పాటుగా ఉండిలో టిడిపి గెలిచింది. అప్పటి నుండి ఈ రెండు నియోజకవర్గాలలో టిడిపిని బలహీనపరిచి పూర్తిస్థాయిలో పాగా వేయడానికి వైసిపి వ్యూహాలు రచిస్తోంది . తాజాగా నగర పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకివీడులో వార్డుకు ఒక ఎమ్మెల్యే నాలుగు వార్డులకు ఒక మంత్రి ఇన్ఛార్జి గా వ్యవహరిస్తూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. జిల్లా మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం కోసం వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు.

టీడీపీ పట్టు నిలుపుకోవటం కోసం జనసేనతో ఒప్పందం , జోరుగా ఎన్నికల ప్రచారం

టీడీపీ పట్టు నిలుపుకోవటం కోసం జనసేనతో ఒప్పందం , జోరుగా ఎన్నికల ప్రచారం

ఇక ప్రస్తుతం ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ విజయం సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టిడిపి తమ పట్టు నిలుపుకోవడం కోసం జనసేన తో ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల రంగంలో ముందుకు వెళుతుంది. టిడిపి నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు రాష్ట్ర స్థాయి నేతలు ఆకివీడు పై ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్కడే పాగా వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజు కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఆకివీడులో మెజారిటీ వార్డు దక్కించుకోవడానికి ఆయన నానా పాట్లు పడుతున్నాడు.

ఆకివీడు ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ .. ఒక్క అవకాశంతో ఇంత ప్రమాదం

ఆకివీడు ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ .. ఒక్క అవకాశంతో ఇంత ప్రమాదం

ఇదిలా ఉంటే ఆకివీడు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికార వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. పేదవారి చెమటను బ్రాందీ రూపంలో లాగేసుకున్న వ్యక్తి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ లేరని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి, ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశం ఇంత ప్రమాదానికి దారితీస్తుందని ఎవరు ఊహించలేదని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.

జగన్ బాత్ రూమ్ అంత కూడా లేని జగన్ ఇచ్చే ఇళ్ళ స్థలాలు

జగన్ బాత్ రూమ్ అంత కూడా లేని జగన్ ఇచ్చే ఇళ్ళ స్థలాలు

అమ్మ ఒడి పేరుతో 14 వేలు ఇస్తే, నాన్నల జేబులో నుండి లక్షల రూపాయలు లాగేస్తున్నారు అని మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడి పేద ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడిన చింతమనేని ప్రభాకర్, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు జగన్ అంటూ మండిపడ్డారు. ఆయన బాత్రూం ఎంత ఉందో పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలం కూడా అంతే ఉంటుందని చింతమనేని ఎద్దేవా చేశారు. ప్రజలను అడుగడుగున మభ్య పెడుతున్నారని పేర్కొన్న చింతమనేని ప్రభాకర్ టిడిపి అభ్యర్థులను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

English summary
Chintamaneni Prabhaka made sensational remarks in akividu elections. Prabhakar said he was upset with Jagan rule. Mentioning such a danger with one chance,incensed that Jagan was drinking the sweat of the poor in the form of brandy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X