వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీని నడిపే సత్తా తారక్‌కే ఉంది, లోకేశ్ దద్దమ్మ, ఏపీ మంత్రి కొడాలి నాని..

|
Google Oneindia TeluguNews

ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. వల్లభనేని వంశీ రాజీనామా, సస్పెన్షన్ పీక్ స్టేజీకి తీసుకొచ్చింది. వల్లభనేని ఇష్యూ కొనసాగుతుండగానే ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, లోకేశ్‌పై తనదైన శైలిలో విమర్శించారు. టీడీపీకి ప్రజాధరణ తగ్గడానికి వారే కారణమని ఆరోపించారు. ఇకనైనా పార్టీ పగ్గాలు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే టీడీపీ ఉనికి, అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 బాబులే..

బాబులే..

తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబు, లోకేశ్ కారణమని కొడాలి నాని అన్నారు. పార్టీని వారిద్దరూ కలిసి పూర్తిగా ముంచకముందే పగ్గాలు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2009లో కూడా టీడీపీకి వచ్చిన సీట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం వల్లేనని గుర్తుచేశారు. లేదంటే బాబులకు అంత లేదని విమర్శించారు.

Recommended Video

Vallabhaneni Vamsi & Kodali Nani Strategically Comparing Lokesh And Jr NTR || Oneindia Telugu
అడ్డదారిలో పదవులు

అడ్డదారిలో పదవులు

ఏపీ మాజీ మంత్రి లోకేశ్ దద్దమ్మ కాబట్టే అడ్డదారిలో పదవీ కట్టబెట్టారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని తెలిపారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే నాయకత్వ మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని కొడాలి నాని అన్నారు.

తారక్‌కే ఎందుకంటే..

తారక్‌కే ఎందుకంటే..

పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు అప్పగిస్తేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుందని నాని చెప్పారు. అలా కాదని లోకేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మునగడం ఖాయమని కొడాలి నాని జోస్యం చెప్పారు. తారక్ నాయకత్వంలో పార్టీకి పూర్వస్థితి వస్తోందని కొడాలి నాని అన్నారు.

ఎందుకిలా...

ఎందుకిలా...

ఏపీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీశాయి. వైసీపీలో ఉన్న కొడాలి నాని టీడీపీ గురించి కామెంట్ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై భిన్నరకాలుగా పలువురు స్పందిస్తున్నారు. మరోవైపు వంశీ తన స్నేహితుడు అని.. ఆయన ఇబ్బందుల్లో ఉన్నందున కొడాలి నాని స్పందించారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఎముకలు కొరికే చలిలో కూడా హీట్ పుట్టిస్తున్నాయి.

English summary
tdp will survive junior ntr leadership ap minister kodali nani told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X