• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన టీడీపీ మహిళా నేతలు అనూరాధ, దివ్యవాణి... ఏమన్నారంటే

|

విజయవాడ ధర్నా చౌక్ లో నేడు చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపైన ఇసుక దీక్ష చేస్తున్నారు.ఇసుక దీక్షలో పాల్గొన్న టిడిపి మహిళా నేతలు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇసుక కొరతతో రాష్ట్రంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వైసిపి నేతలు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు.

వైసీపీ నేతలవే దొంగ దీక్షలన్న పంచుమర్తి అనూరాధ

వైసీపీ నేతలవే దొంగ దీక్షలన్న పంచుమర్తి అనూరాధ

దొంగ దీక్షలు చేసేది వైసిపి అని, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఖర్మ పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష సందర్భంగా మాట్లాడిన మహిళా నేతలు పంచుమర్తి అనురాధ, దివ్యవాణి లు వైసిపి నేతలపై విమర్శల వర్షం కురిపించారు.ఇసుక కొరతతో ఎంతమంది చనిపోతున్నారో జగన్‌కు కనిపించడం లేదా? అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి‌ అనురాధ ప్రశ్నించారు. చంద్రబాబు ఇసుక దీక్షను వైసీపీ నేతలు దొంగదీక్ష అనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనురాధ గతంలో వైసీపీ చేసిన దీక్షలే దొంగదీక్షలు అని చెప్పుకొచ్చారు.

 పార్ధసారధిపై విరుచుకుపడిన అనూరాధ

పార్ధసారధిపై విరుచుకుపడిన అనూరాధ

ఇక వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధిపై విమర్శలు చేసిన అనురాధ మద్దూరు ఇసుక టెండర్ ఒకే ఒక్క వ్యక్తికి ఇచ్చారని ఆయన పార్థసారధి అనుచరుడని పేర్కొన్నారు. పార్థసారథికి దమ్ముంటే పెనమలూరు నియోజకవర్గంలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు పంచుమర్తి అనురాధ. ఇక టీడీపీ ఇటీవల ప్రకటించిన చార్జిషీట్లోఇసుక దొంగల పేర్లు ఇచ్చామని, అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇసుక కొరతతో ఎంతమంది చనిపోతున్నారో వైసీపీ నేతలకు తెలీదా అని మండిపడ్డారు . ఇసుక దీక్షలో టీడీపీ చేస్తున్న మూడు డిమాండ్లు నెరవేరే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు అనూరాధ .

వైసీపీ నేతలకు శాపనార్ధాలు పెట్టిన దివ్యవాణి

వైసీపీ నేతలకు శాపనార్ధాలు పెట్టిన దివ్యవాణి

ఇక టీడీపీ నేత దివ్య వాణి జగన్ మోహన్ రెడ్డిపై, వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్త చేశారు. ఇసుక సమస్య ఇంతగా వేధిస్తుంటే చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఇక అంతేకాదు మీ కళ్ళు కాకులు పొడవా , గద్దలు పొడవా అంటూ శాపనార్ధాలు పెట్టారు. వైసీపీ నేతల దృష్టి చంద్రబాబు మీద, లోకేష్ మీద మాత్రమే ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కక్షపూరితమైన రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి దివ్యవాణి హిత

వు పలికారు.

ఇసుక సమస్య పరిష్కారం కాకుంటే ఇసుకలోనే ప్రభుత్వాన్ని పూడుస్తామని హెచ్చరిక

ఇసుక సమస్య పరిష్కారం కాకుంటే ఇసుకలోనే ప్రభుత్వాన్ని పూడుస్తామని హెచ్చరిక

చంద్రబాబు ఇసుక దీక్షలో పాల్గొన్న ఆమె ఉచితంగా ఇసుక సరఫరా చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలుగు భాషపై పెత్తనం చేసే ఏ భాష మనకు అక్కర్లేదన్నారు. ఇసుక సమస్య పరిష్కరించకుంటే అదే ఇసుకతో వైసీపీ నేతలను తోమి ఆ ఇసుక లోనే వైసీపీ సర్కార్ ను పూడ్చిపెడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదిక కూల్చివేత కాదు, ముందు ఇసుక సమస్య పరిష్కరించమన్నారు. ఇసుక సమస్యతో కార్మికులు చనిపోతున్నా పట్టింపు లేని ప్రభుత్వం ఓ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. మొత్తానికి వైసిపి నేతలపై , ఏపీ సర్కార్ పై టిడిపి మహిళా నేతలు నిప్పులు చెరిగారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP women leaders involved in the sand strike by chandrababu in Vijayawada dharna chowk . they outraged on ycp leaders and ap government .Divyavani and panchumarthi Anuradha fired. alleged that sand shoratge is a big problem in ap and the government is not responding on the serious issue . the construction workers committing suicides and the government is not aware of the suicides .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more