వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా సభల్లో జరిగిన అవమానం రాంమాధవ్ మరచిపోలేదా..? ఇక టీడీపీ అక్కడే మిగులుతుందట..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏపిలో ఉండదని కేవలం తానా సభల్లోనే మిగలనుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల వరకు బీజేపీ బలం పుంజుకునే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

టీడీపీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది..

టీడీపీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది..

ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న మాధవ్ టీడీపీ తీవ్ర అవినీతీలో కూరుకుపోయిందని ,నేరాలకు నిలయంగా మారిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుండి పోయ్యిమీద నుండి పెనంలో పడేందుకు కూడ ప్రజలు అవకాశం ఇవ్వకూడదని కోరారు.ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ లేకుండా చూసుకుంటాడని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాత్రం టీడీపీ లేకుండా ఇక్కడి నేతలు చూసుకోవాలని అన్నారు.

ఒక్కో కార్యకర్త 25 మంది కొత్త సభ్యులను చేర్పించాలి.

ఒక్కో కార్యకర్త 25 మంది కొత్త సభ్యులను చేర్పించాలి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ బలం పుంజుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అశించిన మేరకు ఏపీలో ప్రజలు ఓట్లు వేయలేదని,కాని ఏపీ అభివృద్దికి బీజేపీ కట్టుపడి ఉందని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రతి కార్యకర్త కృషి చేసి ఏపీలో ఎక్కువగా ఓట్లు పడేవిధంగా చూడాలని కోరారు. దేశంలో వచ్చిన ప్రేరణతోనే ఏపీలో కూడ పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని అన్నారు.ఒక్కో కార్యకర్త స్వయంగా 25 మంది కొత్త సభ్యులకు సభ్యత్వం ఇప్పించాలని, అలా చేయని వారు ఏ పదవీ ఆశించడానికి అర్హతే లేదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.

బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఉండవు

బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఉండవు

ఇక బీజేపీలో గ్రూపు రాజకీయాలతోపాటు ,ధనం,కుల రాజకీయాలు ఉండవని అన్నారు. వీటన్నింటికి అతీతంగా బీజేపీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.కాగా కోత్తగా పార్టీలో చేరే నాయకులు ఈ అంశాలను గమనించాలని కోరారు. ఇక బీజేపీ కేవలం అధికారం కోసమే కాదని ప్రజలకు సేవ చేయడమే పార్టీ లక్ష్యమని ఆయన ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజల్లో బల పడిందని ఇదే విధంగా ఏపీలో కూడ ఇదే విధంగా బలపడాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

English summary
BJP national general secretary Ram Madhav made a strong statement on tdp.he says that party will be closed in the ap .and it will be only in TANA meetings only he criticised. ram madav participated in membership campaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X