వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Jagan: కేస్ స్టడీగా జగన్ అవినీతి: తండ్రి అధికారం..43 వేల కోట్లు పోగు: ఐఐఎం-అహ్మదాబాద్ కు టీడీపీ..

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) సహకారాన్ని తీసుకుంటోన్న వేళ.. తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. జగన్ సర్కార్..ఏ ఐఐఎం-అహ్మదాబాద్ సహకారాన్ని తీసుకుంటోందో.. అదే ఐఐఎం-అహ్మదాబాద్ కు లేఖ రాసింది టీడీపీ.

అత్యంత అవినీతి పరుడు.. వైఎస్ జగన్

అత్యంత అవినీతి పరుడు.. వైఎస్ జగన్

తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎం-అహ్మదాబాద్ పబ్లిక్ సిస్టమ్ గ్రూప్ ఫ్యాకల్టీ విభాగాధిపతి ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామికి సోమవారం లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత అవినీతిపరుడని ఫిర్యాదు చేశారు. జగన్.. అవినీతిని వ్యవస్థీకృతం చేశారని ఆరోపించారు. ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 43 వేల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. పాలనా యంత్రాంగంలో కంటే ముందు జగన్ అవినీతిపై దృష్టి సారించాలని కోరారు.

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: అనంత యువతికి ఉచిత వైద్యం..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. !బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: అనంత యువతికి ఉచిత వైద్యం..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. !

2004 నుంచి 2009 మధ్యకాలంలో..

2004 నుంచి 2009 మధ్యకాలంలో..

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని కళా వెంకట్రావు ఆరోపించారు. క్విడ్ ప్రొకో విధానంలో అవినీతిని వ్యవస్థీకృతతం చేశారని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా, గనుల అక్రమ తవ్వకాలు, రవాణా, మద్యం మాఫియాలతో చేతులు కలిపి 43 వేల కోట్ల రూపాయల మేర అవినీతి సామ్రాజ్యాన్ని జగన్ విస్తరించారని అన్నారు. దేశంలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పేరు సంపాదించిందని అన్నారు.

సీబీఐ న్యాయస్థానంలో 11 కేసులు..

సీబీఐ న్యాయస్థానంలో 11 కేసులు..


జగన్ అవినీతిపై సీబీఐ సైతం కేసు నమోదు చేసిన విషయాన్ని కళా వెంకట్రావు ఈ లేఖలో ప్రస్తావించారు. జగన్ సీబీఐ న్యాయస్థానానికి విచారణ కోసం హాజరవుతున్నారని చెప్పారు. ఆయనపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో 11 కేసులపై విచారణ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన సంపాదనను భారీగా పెంచుకున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అవినీతిని అరికట్టడానికి ఐఐఎం-అహ్మదాబాద్ తరఫున చర్యలు చేపట్టడానికి ముందుకు రావడం హర్షణీయమే అయినప్పటికీ.. జగన్ అవినీతి కార్యకలాపాలపై దృష్టి సారించాలని కళా వెంకట్రావు సూచించారు.

 అవినీతి రహితంగా..

అవినీతి రహితంగా..

రాష్ట్రాన్ని, దేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి ఐఐఎం-అహ్మదాబాద్ ముందుకు రావడం పట్ల తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేస్తోందని కళా వెంకట్రావు అన్నారు. జగన్ అవినీతిపై అధ్యయనం చేయాలని, అవినీతిని రూపుమాపడంలో వైఎస్ జగన్ ఉదంతాన్ని ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు. అప్పుడే అవినీతిని సమూలంగా నిర్మూలించగలమని చెప్పారు. భవిష్యత్తులోనూ జగన్ అవినీతి తరహా ఉదంతాలు రాకుండా ఉంటాయని అన్నారు.

English summary
Telugu Desam Party State President Kala Venkatrao wrotes a letter to IIM-Ahmedabad on Monday. He mentioned that Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy during his father's tenure as Chief Minister of Andhra Pradesh, 2004-09 has amassed around Rs. 43,000 crores of wealth through quid pro and corrupt practices. He also spent sixteen months in prison as a part of this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X