• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోకూడా రాజకీయాలు..! చీరాలలో కొట్టుకున్న వైసీపీ,టీడీపీ నేతలు

|

చీరాల : దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగితేలితే.. ప్రకాశం జిల్లాలో మాత్రం రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు సాములు మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌లో మాటల తూటాలు పేలాయి.

టీడీపీ, వైసీపీ.. ఫైటింగ్ సీన్

టీడీపీ, వైసీపీ.. ఫైటింగ్ సీన్

చీరాల తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఎగురవేయడానికి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం. అదే సమయంలో ఆమంచి సోదరుడు సాములు తన అనుచరులతో కలిసి అక్కడకు వచ్చారు. ఆ సందర్భంలో ఇరు పార్టీల కార్యకర్తలు మాటలు తూలారు. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఒకానొక దశలో పోలీసులు జోక్యం చేసుకున్నా వారెవరూ వినిపించుకోలేదు.

ఐదుసార్లు ఎమ్మెల్యే.. హైదరాబాద్‌లో 5 రూపాయల భోజనం.. సింపుల్ మ్యాన్

జెండా పండుగ నాడు కూడా పాత కక్షలేనా?

జెండా పండుగ నాడు కూడా పాత కక్షలేనా?

జెండా పండుగ వేళ చీరాలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడం స్థానికంగా చర్చానీయాంశమైంది. ఇదివరకు కూడా కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. ఆ రెండు వర్గాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో స్వాంత్రత్య దినోత్సవ వేళ కూడా సంయమనం పాటించకుండా ఇరు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడటం హాట్ టాపికయింది.

చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులు లాఠీ ఎత్తితే గానీ..!

చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులు లాఠీ ఎత్తితే గానీ..!

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరూ కూడా తగ్గకపోవడంతో చాలాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. నువ్వెంతంటే నువ్వెంత అంటూ తిట్ల దండకం అందుకున్నారు. మాటలు జారుతూ ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ఆ నేపథ్యంలో తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇరు వర్గాలకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు లాఠీలు లేపారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ శ్రేణులను నిలువరించి అందర్నీ చెదరగొట్టారు.

భారత్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు.. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపిన రష్యా

 కరణం, ఆమంచి వర్గాల మధ్య ఈ గొడవలేంటో..!

కరణం, ఆమంచి వర్గాల మధ్య ఈ గొడవలేంటో..!

చీరాల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందన్న వార్త దావానంలా వ్యాపించడంతో అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ స్థానికంగా కనిపించింది. అయితే ఇరు వర్గాలు ఒకేసారి అక్కడకు రావడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అదలావుంటే కరణం బలరాంకు జెండా ఎగురవేసే అర్హత లేదని ఆమంచి సాములు వర్గీయులు అడ్డుకోవడంతోనే ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. మొత్తానికి మరోసారి చీరాలలో కరణం, ఆమంచి వర్గాల మధ్య దుమారం రేగడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. అయితే ఇండిపెండెన్స్ డే రోజు కూడా నేతలు సహనం పాటించకుండా రాజకీయ కక్షలు బయటపెట్టుకోవడం మంచి పద్దతి కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If people all over the country engage in celebration of Independence Day .. In Prakasam district there is a political vibe. There was an atmosphere of confrontation between the TDP and YCP leaders. An argument broke out between the activists of the two parties during the flag festival ceremony held at the Chirala tahsildar office. Local TDP MLA Karanam Balaram and former YCP MLA Amanchi Krishnamohan's brother Samulu have slipped tongue. Police battered batons and dispersed the two communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more