వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆగ్రహం ఎఫెక్ట్: సుజన ఇంట్లో కీలక భేటీ, సస్పెన్షన్‌కు రెడీ, రాజ్‌ను కలవనున్న వైసీపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏపీ పట్ల సానుభూతితో ఉన్నామని, పునర్విభజన చట్టంలోని ప్రతి ప్రత్యేక భాగాన్ని, వివిధ స్థాయిల్లో కేంద్రం చేసిన ప్రతి హామీని గౌరవిస్తున్నామని, ప్రతి అంశానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన టీడీపీకి ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదు.

Recommended Video

Arun Jaitley On Special Package & Visakha Railway Zone In Rajya Sabha

చదవండి: </a><a class=టీడీపీ కొత్త వ్యూహం, కాంగ్రెస్‌కు ఝలక్: సీఎంతోనే.. జైట్లీ-మోడీ ఎదుట చేతులెత్తేసిన సుజన" title="చదవండి: టీడీపీ కొత్త వ్యూహం, కాంగ్రెస్‌కు ఝలక్: సీఎంతోనే.. జైట్లీ-మోడీ ఎదుట చేతులెత్తేసిన సుజన" />చదవండి: టీడీపీ కొత్త వ్యూహం, కాంగ్రెస్‌కు ఝలక్: సీఎంతోనే.. జైట్లీ-మోడీ ఎదుట చేతులెత్తేసిన సుజన


చదవండి: బాబుకు లేఖ రాశాం, అలా అడిగితే నష్టం: ఏపీపై రాజ్యసభలో జైట్లీ కీలక ప్రకటన, రైల్వే జోన్‌పై గోయల్

ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీలు బుధవారం కూడా ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేయనున్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన కారణంగా సమావేశాలు పదేపదే వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చు.

సస్పెన్షన్‌పై బాబు ఆదేశాలు

సస్పెన్షన్‌పై బాబు ఆదేశాలు

బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై పోరాటం చేయాల్సిందేనని, సస్పెండ్ అయినా ఫర్వాలేదు ఉభయ సభల్లో నిరసన తెలపాలని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు రెండు రోజులుగా సూచిస్తున్నారు. బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి సుజన ఇంట్లో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చించారు. సుజన మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయి ఆ తర్వాత వివరాలను చంద్రబాబుకు వివరించిన విషయం తెలిసిందే.

రాజ్‌నాథ్‌తో వైసీపీ ఎంపీల భేటి

రాజ్‌నాథ్‌తో వైసీపీ ఎంపీల భేటి

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. విభజన హామీలపై వారు హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.

చంద్రబాబు అసహనం ఎఫెక్ట్, ఎంపీలతో భేటీ

చంద్రబాబు అసహనం ఎఫెక్ట్, ఎంపీలతో భేటీ

ఇదిలా ఉండగా, ఢిల్లీలో సుజనా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఓ రొటీన్ సమావేశమే అన్న అర్థం వచ్చే వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతూ న్యాయం జరిగేందుకు ఎలా పోరాడాలో నిర్ణయించేందుకు సమావేశమైతే దాన్ని రొటీన్ అని చెప్పడమేమిటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుజన నివాసంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీలకు సూచనలు చేయాలని, వారి సూచనలు తీసుకోవాలని, కేంద్రంపై పోరాడాలని సుజనకు చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుజన ఎంపీలతో భేటీ అవుతున్నారు. జైట్లీ ప్రకటనపై సంతృప్తిగా లేని టీడీపీ ఎంపీలు బుధవారం కూడా ఆందోళన చేయనున్నారు. సస్పెన్షన్‌కు గురైన ఫర్వాలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

రెవెన్యూ లోటు

రెవెన్యూ లోటు

మరోవైపు, కేంద్రం చర్చించడానికి నలుగురు సభ్యుల బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఇందులో ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రాష్ట్ర విభజన వ్యవహారాల ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రా రెడ్డి, విభజన సమస్యల పరిష్కార కమిటీ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన మరుసటి ఏడాది (2015-16)ఏపీ రెవిన్యూ లోటును రూ.6,609 కోట్లుగా ఆర్థికసంఘం నిర్ణయించింది. 2016-17లో దాన్ని రూ.4,930 కోట్లకు తగ్గించింది.

రూ.18వేల కోట్లకు రెవెన్యూ లోటు

రూ.18వేల కోట్లకు రెవెన్యూ లోటు

ఒక్క ఏడాదిలోనే 25 శాతం మేర తగ్గిందంటే 2014-15లో తమ రెవిన్యూ లోటు 2015-16లో ఆర్థికసంఘం సిఫార్సు చేసిన మొత్తంకంటే 25 శాతం ఎక్కువ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదీగాక తమకు 14వ ఆర్థిక సంఘం 2015-16లో రూ.54వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే వాస్తవంగా రూ.42 వేల కోట్లే వచ్చిందని ఈ రెండింటినీ కలిపితే రెవిన్యూ లోటు రూ.18వేల కోట్లకు చేరుతుందని చెబుతున్నాయి. ఇదే అభిప్రాయాన్ని ఈ నలుగురు సభ్యుల బృందం కేంద్రానికి నివేదించనున్నారు.

English summary
Union minister of state for science and technology, Sujana Chowdary on Tuesday met Prime Minister Narendra Modi in Parliament and discussed the issue of meagre allocation for Andhra Pradesh in the Union budget, an issue on which the TDP has been staging protests over the last few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X