వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో అడగ్గానే..: గెలుపే లక్ష్యంగా పావులు, ఇదీ సమాజిక సమీకరణం

నంద్యాల ఉప ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఏ సామాజిక వర్గం ఎవరికి అండగా ఉంటుంది? అనే చర్చ సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఏ సామాజిక వర్గం ఎవరికి అండగా ఉంటుంది? అనే చర్చ సాగుతోంది.

ఎవరి ఓట్లు ఎన్ని అంటే?

ఎవరి ఓట్లు ఎన్ని అంటే?

నంద్యాల నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2.09 లక్షలు ఉన్నాయి. అందులో ముస్లీం ఓటర్లు సుమారు 50 వేలు, కాపు బలిజ ఓటర్లు 45 వేలు, వైశ్యుల ఓట్లు 22 వేలు, రెడ్డి ఓట్లు 15 వేలు, క్రిష్టియన్‌ ఓట్లు 12 వేలు, ఎస్సీ ఓట్లు 17 వేల వరకు ఉన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. రెండు మూడు సామాజిక వర్గాల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశముంది. 2.09 లక్షల ఓటర్లలో వారిలో పురుషులు 1.06 లక్షలు, మహిళలు 1.03 లక్షలు, థర్డ్‌ జండర్‌ 61 ఓటర్లు ఉన్నారు.

పనులు చేయించుకునే ప్రయత్నం

పనులు చేయించుకునే ప్రయత్నం

ఆయా సామాజిక వర్గాల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది కలిసి ఉన్నారని ప్రచారం సాగుతోంది. అలా చెబుతూ ఆయా పార్టీల నుంచి తమ పనులు చేయించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికల తర్వాత నేతలు మాట తప్పకుండా ఉండేందుకు ఆయా సామాజిక వర్గాలు ముందుగానే పక్కా ప్లాన్‌తో వెళ్తున్నాయని తెలుస్తోంది.

Recommended Video

Venkaiah Naidu praises Roja - Oneindia Telugu
అందరికీ ప్రాధాన్యత

అందరికీ ప్రాధాన్యత

ఆయా సమాజిక వర్గాల్లో తక్కువ మంది ఉన్నప్పటికీ పార్టీలు వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఉప ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఏ ఒక్క ఓటును పక్క వారికి పోకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఉన్న వర్గం వరకు పావులు కదుపుతున్నారు. కమ్యూనిటీ హాల్స్ సహా ఎన్నింటి పైనో ఆయా పార్టీల నేతలు అడిగిన క్షణమే కోరికలపై హామీలు ఇస్తున్నారని అంటున్నారు.

చక్రపాణి రెడ్డి ప్రసంగమే

చక్రపాణి రెడ్డి ప్రసంగమే


మూడో తేదిన జగన్‌ ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ప్రసంగమే.. ఇక్కడి సామాజికవర్గాల ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైశ్యుల ఓట్లు, ముస్లీంలు సహా అన్ని సామాజిక వర్గాల వారు తమకే ఓటు వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Telugu Desam leaders and YSR Congress leaders are wooing Nandyal voters in bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X