వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు పద్యం అప్పజెప్పలేదని.. విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్!

తెలుగు పద్యం అప్పజెప్పలేదనే కోపంతో ఓ టీచర్ కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలం డి.భీమవరం గ్రామం రెసిడెన్సియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు పద్యం అప్పజెప్పలేదనే కోపంతో ఓ టీచర్ కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలం డి.భీమవరం గ్రామం రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న పి.గాంధీ.. విద్యార్థులను తెలుగు పద్యం అప్పజెప్పమన్నారు. అయితే, విద్యార్థులు ఆ పద్యాన్ని చెప్పలేకపోయారు. దీంతో, ఆగ్రహించిన గాంధీ తన కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టాడు.

Teacher beaten Students with his Sandal for not telling telugu poem

ఈ ఘటనపై పాఠశాలలో పనిచేస్తున్న తోటి టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా గిరిజన సంక్షేమ అధికారి జల్లి శాంబుడు పాఠశాలలో విచారణ జరిపారు. ఆయన నివేదిక అందిన తర్వాత ఉన్నతాధికారులు టీచర్ గాంధీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ''చెప్పుతో కొట్టడమేకాక, ఆ విషయం బయటకు చెబితే పదో తరగతి పరీక్షల్లో అందరినీ ఫెయిల్ చేసేస్తా అని టీచర్ గాంధీ మా పిల్లల్ని బెదిరించాడు..'' అని చెప్పారు. పాఠశాల హెడ్ మాస్టర్ కూడా గాంధీకే మద్దతు పలుకుతున్నారని వారు ఆరోపించారు.

English summary
A telugu teacher, P.Gandhi, who is working in a Residentaial School in D.Bhimavaram Village of Addateegala Mandal, East godavari District beaten students with his sandal for not telling him a telugu poem. Other teachers of the school bring this issue to their higher officials. Tribal Welfare Officer Jalli Sambudu conducted an enquiry on this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X