మీరేమి పెద్దలురా..! మైనర్ బాలికను టీచర్ రేప్ చేస్తే.. వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారా..!
తూర్పుగోదావరి/హైదరాబాద్:విద్యా బుద్దులు చెప్పాల్సిన ఉపాద్యాయుడే గడ్డి తినే పని చేసాడు. తల్లి దండ్రుల తర్వాత అంతటి స్థానం ఉన్న ఉపాద్యాయుడు సభ్య సమాజం తల దించుకునే పని చేసాడు. పదవ తరగతి లోపు విద్యార్ధులు ఆకర్శణకు లోనవుతూ వాస్తవ పరిస్థితులను అంతగా అంచనా వేయలేని సందిగ్దంలో ఉంటారు. అలాంటి వారికి వాస్తవ పరిస్తితులు చెప్పి కనువిప్పు కలిగాంచాలి గాని బలహీనతలను ఆసరా చేసుకోకూడదు.
అందులో ఉపాద్యాయ వృత్తిలో ఉన్న వారు ముఖ్యంగా ఈ నియమాన్ని వందకు వంద శాతం పాటించాల్సి ఉంటుంది. కాని అందుకు విరుద్దంగా వ్యవహరిస్తే మాత్రం అది పైశాచిక చర్యే అవుతుంది. ఇలాంటి సంఘటనే ఏపీ చోటు చేసుకుంది. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాద్యాయుడు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని పెళ్లి చేసుకుని ఛీ అనిపించుకున్నాడు.వై.రామవరం మండలం దాలిపాడు ప్రభుత్వ గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో దారుణం ఒకటి వెలుగు చూసింది.
Recommended Video
ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు వివాహం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు దాలిపాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు, వార్డెన్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని.. ఏడాది కాలంగా ఆ బాలికతో సంబంధం కొనసాగిస్తున్నాడు.
విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియటంతో ఉపాథ్యాయుడిని నిలదీయడంతో పాటు.. విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పెద్దల సమక్షంలో మైనర్ బాలికను ఉపాధ్యాయుడు చిన్నబ్బాయి రహస్యంగా వివాహం చేసుకున్నాడు.ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలయజేయడం కొసమెరుపు.