వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిల ముందు బ్లూఫిలిమ్స్ చూస్తూ టీచర్ల వెకిలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Teachers shows blue films to students
మహబూబ్ నగర్: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల పైన జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని జడ్చర్ల మండలం అలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న కొంగలి భాలరాజు, ఇంఛార్జీ హెచ్ఎం సురేష్ కుమార్‌లు పదో తరగతి విద్యార్థినులతో గత కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఎస్సై, తహశీల్దారు అక్కడకు చేరుకొని విచారించారు. విద్యార్థినులు వీరి సమక్షంలోనే ఉపాధ్యాయుల అకృత్యాలను చెప్పారు.

క్లాసుల పేరిట పిలిచి తమ ముందే సెల్‌ఫోనులో నీలి చిత్రాలు చూసేవారని చెప్పారు. అసభ్య పదజాలం వాడుతూ కించపరిచేవారన్నారు.

తాము ఇది భరించలేకనే తల్లిదండ్రులకు చెప్పామన్నారు. ఉపాధ్యాయుల ప్రవర్తన పైన తమకు వచ్చిన ఫిర్యాదును కలెక్టర్, డీఈవోలకు పంపిస్తున్నట్లు తహశీల్దారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే, వారిని కేసు నుండి తప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని ఐటీకారిడార్‌లోనే ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి గచ్చిబౌలి ఐటీకారిడార్‌లో ఈ సంఘటన జరిగింది. పీజీ చదువుతున్న యువతిపై దినేష్‌ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆమె అక్కడి సిద్ధార్థ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ తొలి సంవత్సరం చదివింది. అక్కడే దినేష్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో వేధించిన, అతను గురువారం రాత్రి ఆమెను పిలిచి, కత్తితో దాడి చేశాడు. దీనిపై అతను స్పందించాడు.

నాలుగేళ్ల క్రితం ఇద్దరం ప్రేమించుకున్నామని, తరుచూ మాట్లాడేదని, రెండు నెలలుగా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పాడు. ఆమెను చంపి తాను చనిపోవాలనే ఉద్దేశ్యంతో ఇక్కడకి వచ్చానని, పెళ్లి చేసుకుందామంటే అంగీకరించకపోవడంతో దాడి చేశానని చెప్పాడు.

English summary
Teachers shows blue films to students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X