హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసం: సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని పరారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Tech firm dupes employees, owner absconds
హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని పరారయ్యాడు. హైదరాబాదులోని సోమాజిగుడాలో గల సాఫ్ట్‌వేర్ కంపెనీ డబ్బులు వసూలు చేసి వంద మంది ఉద్యోగులను మోసం చేసింది.

సంస్థ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. యజమాని గురువారంనాడు పరారయ్యాడు. హైదరాబాదులోని సోమాజిగుడాలో శంతన్ కృష్ణన్ అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం డెస్ట్రీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించాడు.

అతను 130 మంది ఉద్యోగుల నుంచి 30 వేల నుంచి లక్ష రూపాయలకు ఒక్కొక్కరి నుంచి వసూలు చేశాడు. గత నాలుగు నెలలుగా అతను వారికి వేతనాలు చెల్లించడం లేదు. ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో వదిలేసి అతను పారిపోయాడు. ఈ విషయాన్ని పంజగుట్ట పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎస్ మోహన్ కుమార్ చెప్పారు.

బాధితులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెన్నైకి చెందిన కృష్ణన్ హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్‌లో ఉంటున్నాడు. చాలా మంది బాధితులు బిటెక్, ఎంసిఎ విద్యార్థులు.

English summary
A software company in Somajiguda, which promised to provide jobs to gullible unemployed youth by collecting money from them, dumped at least 100 employees on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X