విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశ్లీల వెబ్‌సైట్లో అమ్మాయి మార్ఫింగ్ ఫోటో పెట్టి..: టెక్కీ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ అమ్మాయి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టి వేధిస్తున్న ఓ సాఫ్టువేర్ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. నిందితుడు గొల్లపూడికి చెందిన మురారీ.

నగరానికి చెందిన మురారి అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తొలుత అతని ప్రేమను అంగీకరించిన యువతి, ఆ తర్వాత అతని మనస్తత్వం తెలుసుకుని దూరమైంది. దీనిని భరించలేని అతను ఆమె చిత్రాలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

Techie arrested for harassing woman in Vijayawada

విషయం తెలుసుకున్న బాధితురాలు భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. మురారిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేశారు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా, మరో వాదన కూడా ఉంది. మురారీ హైదరాబాదులో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గొల్లపూడికి చెందిన ఇతను అదే గొల్లపూడికి చెందిన యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నో చెప్పడంతో ఆమె ఫోటోలను నెట్లో పెట్టాడు.

English summary
Techie arrested for harassing woman in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X