వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రియురాలి ఫోటోలు కాబోయే భర్తకు పంపిన టెక్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మాజీ ప్రియురాలి సెమీ న్యూడ్ చిత్రాలను ఆమె కాబోయే భర్తకు పంపించి, అల్లరిపాలు చేసినందుకు ఓ టెక్కీని విశాఖపట్నం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విశాఖపట్నం నగర సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ పోలీసులు 32 ఏళ్ల ప్రదీప్‌ను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రదీప్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుననాడు. విశాఖకు చెందిన ఓ యువతితో అతనికి ఇంటర్నేట్ ద్వారా పరిచయం అయింది. వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రదీప్‌కు పెళ్లైనప్పటికీ తనకు పెళ్లి కాలేదని యువతిని నమ్మబలికాడు.

 Techie held for defaming girl friend

ఈ విషయం తెలియక యువతి అతనితో ప్రేమలో పడింది. వారి మధ్య కొన్నాళ్లు సంబంధం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కొద్ది నెలల క్రితం ప్రదీప్‌కు పెళ్లైన విషయం యువతికి తెలిసింది. దీంతో అతనికి ఆమె దూరం జరిగింది.

ప్రదీప్ మాత్రం సంబంధాన్ని కొనసాగించమని ఆమెను బలవంతపెట్టాడు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి ఆమెకు పెళ్లి సంబంధం చూశాడు. కాబోయే భర్తకు ప్రదీప్ ఈ మాజీ ప్రియురాలు తనతో కలిసి ఉన్న ఫోటోలను పంపించాడు. దీంతో ఆ పెళ్లి రద్దయింది. యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Officials the City's CCI cell on Saturday arrested software professional for sending semi nude pictures of his ex girlfriend to her fiancee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X