చంద్రబాబు కాన్వాయ్ కారులో సాంకేతిక లోపం: హైవేపై 20 నిమిషాలపాటు..
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
క్లచ్ ప్టేట్లలో లోపం తలెత్తినట్లు గుర్తించిన డ్రైవర్ వాహనాన్ని వెంటనే నిలిపివేశారు. దీంతో కాన్వాయ్‌లోని మరో వాహనంలో చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి వద్ద కాన్వాయ్ 20 నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆ తర్వాత మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.

కాగా, చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం ఇప్పటికే 60వేల కిలోమీటర్ల దూరానికిపైగా తిరిగింది. ఈ కారణం వల్లే వాహనంలో సాంకేతిక లోపం తలెత్తుతున్నట్లు తెలిస్తోంది.