చంద్రబాబు కాన్వాయ్ కారులో సాంకేతిక లోపం: హైవేపై 20 నిమిషాలపాటు..
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
క్లచ్ ప్టేట్లలో లోపం తలెత్తినట్లు గుర్తించిన డ్రైవర్ వాహనాన్ని వెంటనే నిలిపివేశారు. దీంతో కాన్వాయ్‌లోని మరో వాహనంలో చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి వద్ద కాన్వాయ్ 20 నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆ తర్వాత మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.
కాగా, చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం ఇప్పటికే 60వేల కిలోమీటర్ల దూరానికిపైగా తిరిగింది. ఈ కారణం వల్లే వాహనంలో సాంకేతిక లోపం తలెత్తుతున్నట్లు తెలిస్తోంది.
Comments
chandrababu naidu tdp convoy hyderabad amaravathi చంద్రబాబు నాయుడు టీడీపీ కాన్వాయ్ హైదరాబాద్ అమరావతి politics
English summary
technical problem occurred in chandrababu convoy.
Story first published: Friday, November 13, 2020, 21:52 [IST]