వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేత

|
Google Oneindia TeluguNews

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు మాజీమంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్. చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని, చంద్రబాబు పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామనిఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన టీడీపీ నేతలు నిరాశ చెందొద్దన్నారు. ఇక తాజాగా టీడీపీ ఓటమిపై స్పందిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ .. రాష్ట్ర అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బైఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ .. రాష్ట్ర అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కావడంపై టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వ్యాఖ్యానించారు. గుంటూరులోని ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్నాలజీ తమ కొంప ముంచిందా? లేక నేల విడిచి సాము చేశామా? అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు . ఏపీలో పార్టీ పరిస్థితిపై తాను గతంలోనే ఆందోళన వ్యక్తం చేశానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. అయితే తన ఆందోళనను ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు.

 technology has hammered their hands Or did they leave the reality.. self-check required said TDP leader

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఈసారి ఎన్నికల సందర్భంగా కులాల ప్రస్తావన వచ్చిందని బుచ్చయ్యచౌదరి గుర్తుచేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు సీఎల్పీ నేతగా ఉంటేనే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. మొత్తానికి టీడీపీ ఘోర ఓటమిపై టీడీపీ లో అంతర్మధనం జరుగుతుంది. పార్టీ నాయకులు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ ఓటమిపై కొందరు అభిమానులు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అని పెదవి విరుస్తున్నారు.

English summary
TDP leaders should be self-criticized for restricting TDP to 23 seats in the Andhra Pradesh Assembly polls. TDP leader Gorantla Buchhaiah chowdary spoke to media today at Undavalli.In the AP Assembly polls, technology has hammered their hands Or did they leave the reality? He said that it is necessary to check. Gorantla Bucchaiah Chowdhary revealed that he had expressed concern over the situation in the AP. However, he argued that nobody cared about his concern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X