వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్ బిగిన్స్‌: తెలంగాణ పోలీసులు డేటా దొంగిలించారు : టిడిపి నేత‌ల ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

డేటా వార్ ఇప్పుడు ఏపి వ‌ర్సెస్ తెలంగాణ గా మారుతోంది. రాజ‌కీయంగా మొద‌లైన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏకంగా టిడిపి నేత‌లు తెలంగాణ పోలీసుల పైనే ఫిర్యాదు చేసారు. తెలంగాణ పోలీసులు త‌మ పార్టీ డేటా చోరీ చేసి వైసిపి నే నేతల‌కు అంద‌చేసారంటూ టిడిపి నేత‌లు గుంటూరు రూర‌ల్ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. అంతుకు ముందు డేటా చోటీ వ్య‌వ‌హారంలో తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

తెలంగాణ పోలీసులు దొంగిలించారు..

తెలంగాణ పోలీసులు దొంగిలించారు..

ఏపి అధికార పార్టీకి చెందిన నేత‌లు ఏకంగా తెలంగాణ పోలీసుల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు త‌మ పార్టికి చెందిన స‌మాచారాన్ని దొంగిలించి వైసిపికి అంద‌చేసార‌ని..దోషుల పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల ని కోరుతూ గుంటూరు రూర‌ల్ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో తెదేపాను ఓడించాలనే లక్ష్యంతో తెలంగాణలోని కొందరు అధికారులు, వైకాపా నాయకులు కలిసి కుట్ర పన్నారని, అందులో భాగంగా అమరావతి పరిధిలోకి వచ్చి తెదే పా డేటాను వారు తస్కరించుకుపోయారని టిడిపి నేత‌లు ఆరోపించారు. వారిపై కేసులు న మోదు చేసి ఈ మొత్తం కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. వైకాపాకి రాజకీయంగా ప్రయోజనం చేకూ ర్చేందుకు తెలంగాణ పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. కుట్రకు ఫిబ్రవరి 23కి ముందే అమరావతిలోనే బీజం పడింది. వైకాపా నాయకులు, కొందరు తెలంగాణ సీనియర్‌ పోలీసు అధికారులు, ఇత ర రాజకీయ పార్టీలకు చెం దిన కొందరు ప్రముఖ వ్యక్తులు అమరావతిలో రహస్యంగా భేటీ అయ్యారని క‌ళా వెంక‌ట‌రావు చెబుతున్నారు. తెదేపా కార్యక ర్తల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు, పార్టీ కార్యకలాపాలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నారని... పె ద్ద ఎత్తు న ఓట్లు తొలగించేలా ఆ సమావేశంలోనే కుట్ర జరిగిందని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు.

డేటా చోరీ: వెలుగులోకి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు... జగన్, ఇదీ ఫాం7 అంటేడేటా చోరీ: వెలుగులోకి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు... జగన్, ఇదీ ఫాం7 అంటే

ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంపై ఫిబ్రవరి 23నే సోదాలు

ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంపై ఫిబ్రవరి 23నే సోదాలు

కుట్రలో భాగంగానే తెలంగాణ పోలీసు అధికారులు ఫిబ్రవరి 23న మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంపై సోదాలు చేశారని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో టిడిపి నేత‌లు పేర్కొన్నారు. ఆ సంస్థ డైరెక్టర్‌ డి. అశోక్‌, ఇతర ఉద్యోగుల్ని విచారించారని... ఆ సంస్థ కంప్యూటర్లలో ఉన్న కొంత సమాచారాన్ని బలవంతంగా డౌన్‌లోడ్‌ చేశారని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. కొన్ని కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు తీసుకెళ్లిపోయారు. ఎఫ్‌ఐఆర్‌, సెర్చ్‌వారెంట్‌ లేకుండానే ఇదంతా చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు తనిఖీలు చేయడం, కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం సైబరాబాద్‌ కమిషనర్‌కు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. తెలంగాణ పోలీసులు దొంగి లించిన మా సమాచారాన్ని వైకాపా నాయకులకు అందజేశారని టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌. దాన్ని వాళ్లు ఉపయోగించడ మూ ప్రారంభించారని వివ‌రించారు.

కుట్ర జ‌రిగింది..శిక్షించండి..

కుట్ర జ‌రిగింది..శిక్షించండి..

టీడీపీ డేటాను తస్కరించి పెద్ద సంఖ్యలో టీడీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారని... దానిలో భాగంగానే కుప్ప లు తెప్పలుగా ఫామ్‌-7 దరఖాస్తులు వెల్లువెత్తాయనేది టిడిపి నేత‌లు చేస్తున్న వాద‌న‌. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఏపీ రాజకీయాల గురించి పట్టించుకోవు. తెలంగాణ మాత్రం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది. జగన్‌ గవర్నర్‌ను కలవడం ఆ వెంటనే డేటా తస్కరణపై సిట్‌ వేయడం వంటివి చూస్తుంటే టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజే పీల కుట్ర స్పష్టంగా తెలిసిపోతోందని టిడిపి ముఖ్య నేత‌లు చెబుతున్నారు ఈ మొత్తం కుట్రపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయని... కుట్రలో భాగస్వాములైన వైసీపీ నాయకు లు, తెలంగాణ పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టిడిపి త‌మ ఫిర్యాదులో గుంటూరు రూర‌ల్ ఎస్పీని అభ్య‌ర్దించింది.

English summary
AP TDP Leadrs complaint ot Guntur Rural SP on Telanagana Police. TDP Leaders mentioned in Complaint that Telangana Police theft party data and that given to YCP. They demanded for action against Telangana police and YCP leaders who in volved in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X