వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల వివాదం: సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద శనివారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ వైపున 1000 మంది పోలీసులు, ఆంధ్ర వైపున మరో 1000 మంది పోలీసులు మొహరించారు.

టీఆర్ఎస్ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం ఆందోళనకు దిగారు. ఏపీ ఇరిగేషన్ అధికారులు, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు నాగార్జున సాగర్‌కు ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు.

కాగా నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నం... ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.. సాగర్ ప్రాజెక్టుపైనే ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసుల వాగ్వాదం, తోపులాటతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది.

ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం గొడవలకు కూడా దిగారు. ఈ ఘటనలో పోలీసులు పలువురికి గాయాలుకాగా... సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాగర్ ప్రాంతం దద్దరిల్లింది. కృష్ణా జలాల నీటి సమస్య పరిష్కారం కోసం మరికాసేపట్లో గవర్నర్ వద్ద చంద్రబాబు, కేసీఆర్‌లు సమావేశం కానున్నారు.

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద శనివారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ వైపున 1000 మంది పోలీసులు, ఆంధ్ర వైపున మరో 1000 మంది పోలీసులు మొహరించారు.

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఆందోళనకు దిగారు. ఏపీ ఇరిగేషన్ అధికారులు, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు సాగర్కు ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు.

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత


కాగా నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నం... ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.. సాగర్ ప్రాజెక్టుపైనే ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసుల వాగ్వాదం, తోపులాటతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది.

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం లాఠీలు ఝుళిపించుకునే వరకు వచ్చింది. ఈ ఘటనలో పలువురికి గాయాలుకాగా... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కృష్ణా జలాల నీటి సమస్య పరిష్కారం కోసం మరికాసేపట్లో గవర్నర్ వద్ద చంద్రబాబు, కేసీఆర్‌లు సమావేశం కానున్నారు.

English summary
Telangana and andhra police clash over sharing of krishna river water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X