వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులపై బాబు-కెసిఆర్ పోటీ!: వినాశకరమార్గంలో తెలుగు రాష్ట్రాలని సిఎస్ఈ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పారిశ్రామిక పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అనుసరిస్తున్న విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయని శాస్త్ర-పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్-సిఎస్ఈ) ఆందోళన వ్యక్తం చేసింది.

రెండు రాష్ట్రాలూ స్వీయ వినాశకర మార్గంలో పయనిస్తున్నాయని ఈ సంస్థ తమ డౌన్ టు ఎర్త్ తాజా వారపత్రికలో పేర్కొంది. పర్యావరణ అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా పరిశ్రమలకు ఎర్ర తివాచీ పరుస్తున్న తీరు సరికాదని వ్యాఖ్యానించింది.

Telangana, Andhra Pradesh on path of self-annihilation: CSE

భారీ పెట్టుబడులతో వచ్చే వారికి సత్వర అనుమతులు, స్వీయ ధ్రవీకరణ, తనిఖీల నుంచి రక్షణ, భమి - నీరు - విద్యుత్తు కేటాయింపులో ప్రాధాన్యం వంటి వాటి గురించి సిఎస్ఈ ప్రస్తావించింది.

వ్యవసాయం పైన ఆధారపడిన రెండు రాష్ట్రాలు తమ విధానాల వల్ల భారీగా భూములు, జలాలను పరిశ్రమలకు కట్టబెట్టడం సరికాదని పేర్కొంది. రెండు ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సరికాదని అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ ఐపాస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీని కూడా తప్పుబట్టారు.

English summary
Telangana and Andhra Pradesh may be on a path of "self-annihilation" as the two states have embarked on a "reckless" race for attracting industrial investment while putting all green concerns on the backburner, a green body has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X