వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. సనాతన ధర్మం, హిందూ ఆలయాల పరిరక్షణ అంశంలో వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ చేశారు.

ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి? ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి?

తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఉద్యోగం చేస్తోన్న హిందూయేతరులు వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. తిరుమల ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ముద్రించడం, శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి సంబంధించిన వాణిజ్య భవన సముదాయంలో ముస్లింలకు దుకాణాలను కేటాయించడం వంటి సంఘటనల అనంతరం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.

Telangana BJP MLA Raja Singh is appreciate Chief Minister of AP YS Jagan

దీనితో ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీశైలంలో దుకాణాల కేటాయింపు కోసం నిర్వహించిన వేలంపాటలను రద్దు చేసింది. తిరుమల బస్సు టికెట్ల వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. బాధ్యులను సస్పెండ్ చేసింది. పైగా- అన్యమత ప్రచారానికి సంబంధించిన టికెట్లను ముద్రించినది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేనంటూ తేల్చింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మతపరమైన ఇబ్బందులు గానీ, విమర్శలు గానీ ఎదురు కాకుండా ఉండటానికి కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్నారు వైఎస్ జగన్.

దేవాలయాల్లో పనిచేస్తోన్న అన్యమత ఉద్యోగులెవరైనా ఉంటే వారు వెంటనే సంబంధిత శాఖ కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఇదివరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు.

English summary
Bharatiya Janata Party Law maker from Telangana Raja singh is appreciate Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy for his decision on the Temples in the State. Raja Singh Posted in his Twitter account that, appreciate Andhra Pradesh CM YS Jagan for taking such a bold decision, he mentioned. A step forward in protecting Sanatana Dharma at Tirupati, Raja Singh added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X