వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూ కబ్జా చేసింది ఎంతటి వారైనా వదలం: సీఎం కేసీఆర్, అభివృద్ధి పేరుతో దోపిడీ: రేవంత్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని భూ ఆక్రమణలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. భూ ఆక్రమణదారులు పేదవాళ్లయితే వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. కబ్జాదారులపై పీడీ చట్టం పెట్టేందుకూ వెనుకాడవద్దని తెలిపారు.

కబ్జా చేసింది ఎంతటి వారైనా టీఆర్‌ఎస్ నేతలైనా వదలిపెట్టొద్దన్నారు. కబ్జాదారులపై పీడీ చట్టం పెట్టేందుకూ వెనుకాడవద్దని తెలిపారు. కబ్జా చేసింది ఎంతటి వారైనా... టీఆర్‌ఎస్ నేతలైనా వదలిపెట్టొద్దన్నారు. ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవాలన్నారు.

అక్రమార్కులను ప్రభుత్వం ఉపేక్షించదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. తాను కఠినంగా వ్వవహరించడం కొందరికి నచ్చడం లేదన్న ఆయన తాను దేనికీ భయపడనని, వెనక్కి తగ్గనని పేర్కొన్నారు.

Telangana Chief minister K Chandrasekhar Rao comment on land acquisition

ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండలంలో పర్యటించిన రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

అభివృద్ధి పేరుతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వ భూములన్నీ కంపెనీలకు కట్టబెట్టి లబ్ధిపొందారని, అదే విధంగా కేసీఆర్ కూడా భూములను దోచుకునే ప్రయత్నం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి కొత్తకొత్త పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

English summary
Telangana Chief minister K Chandrasekhar Rao comment on land acquisition rule in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X