వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వైఎస్ పేరును నిలబెట్టాలి : సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నవయువ నేత జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు, అశీస్సులు అందజేశారు. జగన్ మంచి పరిపాలన అందించి వైఎస్ పేరు నిలబెట్టాలని ,దీంతోపాటు మూడు, నాలుగు టర్మ్‌లవరకు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనసారా దీవించారు.

ఈసంధర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి ప్రమాణా స్వీకారోత్సవం తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదోక ఉజ్వలమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఈనేపథ్యంలోనే ఉభయ రాష్ట్ర్రాలకు చెందిన తెలుగు ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని బలంగా విశ్వసిస్తున్నానని అన్నారు.ఇక ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన జగన్‌మోహన్ రెడ్డి వయస్సు చిన్నదైనా... భాద్యత పెద్దదని గుర్తు చేశారు. అయితే ఈ ముఖ్యమంత్రి భాద్యతను నిర్వర్తించే శక్తి సామర్ధం ఆయనకు ఉందని గత తొమ్మిది సంవత్సరాల్లో చేసిన కృషితో ప్రస్పుటంగా నిరూపించారు. ఇక జగన్‌మోహన్ రెడ్డి హాయాంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.

రెండు రాష్ట్ర్రాల ప్రభుత్వాలు , ప్రజలు ప్రస్థుతం చేయవల్సిందీ,. ఖడ్గచాలనం కాదు ,కరాచలనం, అని తెలిపారు. ఈనేపథ్యంలోనే రెండు రాష్ట్ర్రాల ప్రజలు ప్రభుత్వాలు ఒకరికోకరు ఆత్మీయతతో , పరస్పరం సహకరించుకుంటూ అద్బుతమైన విజయాలు సాధించాలని అన్నారు.

Telangana CM KCR Congratulated to cm Jagan Mohan Reddy

ఇక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ముందున్న ప్రధమ కర్తవ్వం గోదావరి జలాల వినియోగమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నీటి వినియోగం ద్వార ఉభయ రాష్ట్ర్రాల్లో ఉన్న ప్రతి అంగుళం భూమీసస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు..ఇక ఈ కర్తవ్య నిర్వాహణలో అవసరమైనటుంటి సహాయసహాకారాలు తెలంగాణ ప్రభుత్వం నుండి
అందిస్తామని స్పష్టం చేశారు.

English summary
Telangana CM KCR Congratulated to Jagan Mohan Reddy,who was sworn the new Chief Minister of Andhra Pradesh,he blessed Jagan as three to four terms continue as Chief Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X