వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు విజ‌య‌శాంతి..నారాయ‌ణ ప్ర‌శంస‌లు: అలా చేసినా కేసీఆర్‌కు బుద్ది రాదు: అది చెంప‌పెట్టు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన తెలంగాణ నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఏపీ శాస‌న‌స‌భ‌లో పార్టీ ఫిరాయింపుల పైన ముఖ్య‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌..స్సీక‌ర్ కు చేసిన సూచ‌న పైనా వారు స్పందిస్తున్నారు. జ‌గ‌న్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాల‌ని కాంగ్రెస్‌..సీపీఐ నేత‌లు సూచిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి ఏపీ శాస‌న‌స‌భ‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న పైన దేశ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతుంద‌న్నారు. సీపీఐ నారాయ‌ణ సైతం కేసీఆర్ ఇప్ప‌టికైనా ఏపీ సీఎం జ‌గ‌న్ ను చూసి త‌న విధానాలు మార్చుకోవాల‌ని సూచించారు.

విజ‌య‌శాంతి ప్ర‌శంస‌లు..
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ప్ర‌శంస‌లు కురిపించారు. శాస‌న స‌భ‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌మ ప్ర‌భుత్వంలో ఫిరాయింపులు ఉండ‌వ‌ని..ఒక వేళ జ‌రిగితే వెంట‌నే అటువంటి వారి పైన అన ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ వివాదాస్ప‌దంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన విజ‌య‌శాంతి స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.దేశానికే ఆదర్శంగా ఉంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసిందని విజయశాంతి విమర్శించారు. స్పీకర్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల ను ప్రోత్సహించడంతో హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పీకర్ ను ఎన్నుకుని ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టిన వెంటనే అధికార పక్షం చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని వ్యాఖ్యానించారు.

Telangana congress leader Vijaya Santhi and CPI leader Narayana appreciated AP Cm Jagan on his decision

అలా చేసినా..కేసీఆర్‌కు బుద్ది రాదు..
పార్టీ ఫిరాయింపులకు తాము దూరమని చెప్పిన ఏపీ సీఎం జగన్ ను చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. జగన్ కాళ్ల కింద వంద సార్లు దూరినా కేసీఆర్ కు బుద్ధి రాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్ష పాత్రను పోషిస్తారని చెప్పారు. మోదీ, అమిత్ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. వేలాది మంది ఓటర్లు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే... సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతు న్నారని మండిపడ్డారు. జనాలను మోసం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని ధైర్యంగా చెప్పార‌ని వివ‌రించారు.

English summary
Telangana congress leader Vijaya Santhi and CPI leader Narayana appreciated AP Cm Jagan on his decision on anti defections. Both leaders suggest KCR to follow Jagan in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X