వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు, ఉద్రిక్తత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్ శానససభ ఆవరణలోని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) కార్యాలయం వద్ద జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నారని, వాటిని ఎండగట్టాలని ఆయన నివాదాలు చేశారు.

సంజీవులును పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకుని వెళ్లారు. సంజీవులును అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. సంజీవులును వదిలేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి సిఎల్‌పి కార్యాలయం వద్ద బైఠాయించారు.

ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమం ఇంకా తీవ్రంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. పోలీసుల్లో కూడా తిరుగుబాటు తప్పదని ఆయన అన్నారు. తెలంగామ పోలీసులు కూడా సీమాంధ్ర సర్కారుపై తిరుగుబాటు చేస్తారని ఆయన అన్నారు.

పోలీస్ జై తెలంగాణ

పోలీస్ జై తెలంగాణ

శాసనసభ ఆవరణలోని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం (సిఎల్పీ) వద్ద సంజీవులు అనే తెలంగాణ కానిస్టేబుల్ జై తెలంగాణ అంటూ నినదించారు. ఆ సమయంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీసు తెలంగాణపై చర్చించేందుకు సమావేశమయ్యారు.

ఉద్రిక్త వాతావరణం

ఉద్రిక్త వాతావరణం

ఊహించని రీతిలో కానిస్టేబుల్ సంజీవులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మీడియా ఫోటోగ్రాఫర్ల కెమెరాలు అటు వైపు తిరిగాయి.

సిఎం అంటే తప్పు లేదా..

సిఎం అంటే తప్పు లేదా..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర అంటే తప్పు లేదా గానీ సంజీవులు జై తెలంగాణ అంటే తప్పా అని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ప్రశ్నించారు. సంజీవులును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసుల అదుపులో సంజీవులు..

పోలీసుల అదుపులో సంజీవులు..

జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ సంజీవులును ఇతర పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకుని వెళ్లారు.

కుట్ర చేస్తున్నారని ఆరోపణ..

కుట్ర చేస్తున్నారని ఆరోపణ..

తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్రులు కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పి కొట్టాలని సంజీవులు నినాదాలు చేశారు.

అదుపులోకి తీసుకుని తరలించారు

అదుపులోకి తీసుకుని తరలించారు

జై తెలంగాణ నినాదాలు చేసిన సంజీవులును పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లారు.

వదిలిపెట్టారు...

వదిలిపెట్టారు...

సంజీవులు వదిలిపెట్టాలని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. దాంతో ఆయనను వదిలేశారు.

పొంగులేటి సుధాకర్ రెడ్డి..

పొంగులేటి సుధాకర్ రెడ్డి..

ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇలా కనిపించారు.

గండ్ర బైఠాయింపు..

గండ్ర బైఠాయింపు..

కానిస్టేబుల్ సంజీవులును అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి నిరసించారు. ఆయనను వదిలేయాలని గండ్ర అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో సంజీవులును పోలీసులు వదిలేశారు.

English summary

 A Telangana constable made Telangana slogans at CLP office in the premises of Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X