హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాలీవుడ్‌లా.. సినిమాకు కేసీఆర్ పెద్దపీట, ఆరు సిటీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని హైదరాబాదును చిత్ర నగరిగా మార్చుతామని, హాలీవుడ్ స్థాయిలో రెండువేల ఎకరాల్లో చిత్ర నగరిని నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తెలంగాణలో ఆరోగ్య, రసాయన, విద్యా, సినీ, ఫార్మా, క్రీడా నగరాలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తన ఉత్పత్తి కేంద్రాలు, పరిశోధక కారిడార్లు నిర్మిస్తామన్నారు.

తెలంగాణలో పరిశ్రమకు ఆరు సిటీలు నిర్మిస్తామన్నారు.కాలేజీలోత పరిశ్రమలను అనుసంధానం చేస్తామని, విదేశీ తరహాలో రీసెర్చ్ కారిడార్లు ఉంటాయని, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ రాయితీని పరిశ్రమలకు ఇస్తామని, అవసరమైతే పాత చట్టాలను పూర్తిగా రద్దు చేస్తామని కేసీఆర్ అన్నారు. ఆయన సచివాలయంలో పారిశ్రామిక విధానం పైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల ఉన్నతాధికారులు సమర్పించిన ముసాయిదా పారిశ్రామిక విధానాన్ని ఆమోదించారు.

Telangana to get a Cinema City in 2,000 acres soon

హాలీవుడ్ స్థాయిలో తెలంగాణలో రెండువేల ఎకరాల్లో చిత్ర నగరాన్ని (ఫిల్మ సిటీ)ని నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. తద్వారా స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా చిత్ర నగరి ఉండాలని, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక అంశాలకు సంబంధించిన స్టూడియోలు కూడా ఇందులో ఉండాలన్నారు. సినిమా పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోను హైదరాబాద్ నుండి తరలిపోవద్దని, ఇలాంటి వాతారవణం ఎక్కడా దొరకదన్నారు.

తెలంగాణలో పారిశ్రామిక విధానాల కోసం మరిన్ని పారిశ్రామిక నగరాలను నిర్మిద్దామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికితీసి పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థను నెలకొల్పుతామన్నారు. ఇక్రిశాట్, డీఆర్డీవో లాంటి సంస్థలు ఉన్నాయని, వాటిని కళాశాలలకు అనుసంధానం చేస్తామన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao is planning to set up a ‘Cinema City’ spread over 2,000 acre in Hyderabad with an aim of giving a fillip to the film industry besides giving job opportunities to locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X