వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది... చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చెలరేగిన ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ వివాదం తిరిగి తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వానికి చుట్టుకుంది. ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంతో ఘట్‌ను సందర్శించిన నేతలు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ముఖ్యంగా లక్ష్మీపార్వతీ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.

Telangana government makes arrangement at ntrs ghat; chandarbabu

ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంపై చంద్రబాబు స్పందిచారు. జయంతి సంధర్భంగా ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వమే అలంకరణ ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం కూడ ఘట్ అలంకరణ కోసం తెలంగాణ టీడీపీ నాయకులు ప్రభుత్వానికి లేఖ రాశారని ఆయన తెలిపారు. దీంతో గత సంవత్సరం వలనే ఘాట్‌ను అలంకరిస్తారని భావించామని చెప్పారు.

కాగా ఉదయం అలంకరణపై వివాదం చెలరేగడంతో ఆయన తెలంగాణ నేతలకు ఫోన్ చేసి జరిగిన విషయాలు కనుక్కొన్నట్టు చెప్పారు. ఇలాంటీ విషయాలు ప్రభుత్వానికి ముందుగానే తెలియజేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించక పోతే పార్టీ ద్వార ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో ఇలాంటీవి పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ పార్టీ నేతలకు ఆయన సూచించారు.
మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

English summary
Chandra Babu naidu gave explanation over remarks on ntr ghat decoration on the occasion of NTR's birth anniversary,he told it was mistaken by telangana governmet.and he suggested party cadar it will not be repeated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X