వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ నజరానా, గుత్తా జ్వాలా నవ్వింది(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్లాస్గో (స్కాట్లాండ్) కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అభినందించారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో కశ్యప్, గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్‌తోపాటు పలువురు క్రీడాకారులు సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించిన కేసీఆర్ క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సహకారం ఉంటుందన్నారు.

విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. స్వర్ణం సాధించిన వారికి రూ. 50 లక్షలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెండిపతకం గెలుపొందిన వారికి రూ.25 లక్షలు, కాంస్యం సాధించిన విజేతలకు రూ. 20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. విజేతల కోచ్‌లకు కూడా రూ. 50 లక్షలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ రూ.3 లక్షలు నజరాన ప్రకటించారు. ఈ ప్రోత్సాహక బహుమతులను గోల్కొండ వేదికగా జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ఇవ్వనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తామన్నారు. ఒక స్పోర్ట్ కల్చర్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, హైదరాబాదు పరిసరాల్లో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల ఆగస్టు 15న గోల్కొండ వద్ద జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో క్రీడాకారులందరినీ ప్రోత్సహించి పూర్తిస్థాయిలో వారికి ప్రభుత్వ పరంగా అందజేస్తామని, గత ప్రభుత్వం బకాయిలు కూడా చెల్లిస్తామని ఆయన చెప్పారు.

కేసీఆర్‌తో

కేసీఆర్‌తో

బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో కశ్యప్, గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్‌తోపాటు పలువురు క్రీడాకారులు సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు.

కేసీఆర్, గోపీచంద్

కేసీఆర్, గోపీచంద్

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు శాలువా కప్పి సన్నానం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

కేసీఆర్, గోపీచంద్

కేసీఆర్, గోపీచంద్

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు శాలువా కప్పి సన్నానం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

కేసీఆర్, గోపీచంద్

కేసీఆర్, గోపీచంద్

తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించడం శుభపరిణమమని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్, గుత్తా జ్వాలా

కేసీఆర్, గుత్తా జ్వాలా

డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకు శాలువా కప్పి సన్నానం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

కశ్యప్, గుత్తాజ్వాల, గగన్‌నారంగ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు తదితరులు ఆగస్టు 15న గోల్కొండవద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో నగదు బహుమతులు అందుకోకున్నారు.

కేసీఆర్

కేసీఆర్

కశ్యప్, గుత్తాజ్వాల, గగన్‌నారంగ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు తదితరులు ఆగస్టు 15న గోల్కొండవద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో నగదు బహుమతులు అందుకోకున్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఆస్ట్రేలియా బ్యాడ్మింటన్ టోర్నీ విజేత సైనా నెహ్వాల్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షల బహుమతిని ప్రకటించింది. సైనాకు గత ప్రభుత్వం బకాయిపడిన రూ. 50 లక్షలు కూడా తామె అందజేస్తామని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

కశ్యప్, గుత్తాజ్వాల, గగన్‌నారంగ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు తదితరులు ఆగస్టు 15న గోల్కొండవద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో నగదు బహుమతులు అందుకోకున్నారు.

కేసీఆర్

కేసీఆర్

గ్లాస్గో (స్కాట్లాండ్) కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అభినందించారు.

కేసీఆర్

కేసీఆర్

బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో కశ్యప్, గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్‌తోపాటు పలువురు క్రీడాకారులు సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు.

English summary
The Telangana government plans to develop a 'sports city' around the state capital which would host top level tournaments and help in training sports persons, CM K Chandrasekhar Rao said in Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X