వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి నేత‌ల‌ను తెలంగాణ స‌ర్కార్ వేధిస్తోంది : కేసీఆర్ న‌మ్మ‌క ద్రోహి..300 కోట్లు ఇవ్వ‌టం లేదు...!

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా ఏపి ముఖ్య‌మంత్రి చేసిన ఆరోప‌ణ‌ల‌నే సీనియ‌ర్ ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కొన‌సాగించారు. తెలంగా ణ ప్ర‌భుత్వం ఏపి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను వేధిస్తోంద‌ని రాయ‌పాటి ఆరోపించారు. కేసీఆర్ ఒత్తిడి కార‌ణంగానే పార్టీ మారుతు న్నార‌ని విమ‌ర్శించారు. త‌మకు 300 కోట్ల ప‌రిహారం రావాల్సి ఉన్న ఇవ్వ‌టం లేదంటున్నారు.

కేసీఆర్ న‌మ్మ‌క‌ద్రోహి..
ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను తెలంగాణ సర్కార్‌ వేధిస్తోందని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఒత్తిడి వల్లే కొంతమంది పార్టీ మారుతున్నారని అన్నారు. కేసీఆర్‌ నమ్మకద్రోహి అని, కేసీఆర్‌ బెదిరింపుల కు లొంగేదిలేదన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసినా చంద్రబాబును ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ఎవరెన్ని కు ట్రలు పన్నినా చంద్రబాబే మళ్లీ సీఎం అవడం ఖాయమని రాయపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమ కంపెనీకి సుమారు రూ.300 కోట్ల పరిహారం రావాల్సి ఉందన్నారు. ఎన్నిసార్లు అడిగినా స్పందనలేదని, దీం తో కోర్టును ఆశ్రయించామని రాయపాటి సాంబశివరావు చెప్పుకొచ్చారు.

Telangana Govt harasing AP Leaders : TDP Mp Rayapati allegation on KCR

స్వ‌రం పెంచుతున్న టిడిపి నేత‌లు..
ఏపిలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అధికార పార్టీ నేత‌లు త‌మ స్వ‌రం పెంచుతున్నారు. ఏపిలో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా కెటీఆర్‌..టిఆర్‌య‌స్ నేత‌లు మాట్లాడుతుండ‌టంతో..టిడిపి నేత‌లు ఎదురు దాడి ప్రారంభించారు. జ‌గ‌న్‌..కేసీఆర్..మోదీ క‌లిసి ఏపి లో టిడిపికి వ్య‌తిరేకంగా కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. తాజాగా టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ సైతం నేరుగా ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఏపి లో జ‌గ‌న్ గెలుస్తా డంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల పై టిడిపి నేత‌లు గ‌ట్టిగానే రియాక్ట్ అయ్యారు. దీంతో..ఇప్పుడు ఏపి ఎన్నికల స‌మ‌యం లో తెలంగాణ‌లోని ఏపి నేత‌ల‌ను అక్క‌డి ప్ర‌భుత్వం లక్ష్యంగా చేసుకుందంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల పై తెలంగాణ ప్ర‌భు త్వం ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి..

English summary
TDP MP Rayapati Samba siva Rao serious comments on Telangana CM KCR. Rayapati says Telangana Govt harassing AP public representatives in Hyderababd. Telangana govt not giving his compensation about 300 cr to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X