వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ, కర్ణాటక హైరిస్క్.. ఏపీ క్వారంటైన్ నిబంధనల్లో కీలక మార్పులివే

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ నిబంధనల్లో మార్పులు చేసింది. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ, కర్ణాటక హైరిస్క ప్రాంతాలుగా..

తెలంగాణ, కర్ణాటక హైరిస్క ప్రాంతాలుగా..


తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హై రిస్క్ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గతంలో తెలంగాణ, కర్ణాటకను లోరిస్క్ ప్రాంతాలుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అయితే అక్కడ కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరడంతో హై రిస్క్ ప్రాంతాలుగా మార్చింది.

విదేశాల నుంచి ఏపీకి వస్తే..

విదేశాల నుంచి ఏపీకి వస్తే..

విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉన్న 14 రోజుల క్వారంటైన్ ఏడు రోజులకు కుదింపు, విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్‌లో ఉన్నవారికి ఐదో రోజు, ఏడో రోజు కరోనా టెస్టు చేయాలి.

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వస్తే..

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వస్తే..

దేశంలోని వివిధ ప్రాంతాలకు నుంచి వచ్చే విమాన ప్రయాణికుల నుంచి 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేయాలి. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాలి. ఆ తర్వాత వారందరికీ 14 రోజుల హోంక్వారంటైన్ వెసులుబాటు కల్పించాలి.

14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి..

14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి..

రైళ్ల ద్వారా ఏపీకి వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేయాలి. వారికి 14 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి.
రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాలి. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి.

ఏపీకి రావాలంటే అనుమతి తప్పనిసరి..

ఏపీకి రావాలంటే అనుమతి తప్పనిసరి..

ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఈ పాస్‌కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందే.
రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు చేసి కొవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.
హోంక్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎంలు,
గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి.
కాగా, ఏపీలో గత 24 గంటల్లో 1935 కరోనా కేసులు నమోదు కాగా, 37 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరగా, మృతుల సంఖ్య 365కు చేరింది.

Recommended Video

Russia Successfully Complete Human Trials Of Coronavirus Vaccine || Oneindia Telugu

English summary
telangana high risk area: andhra pradesh govt changed quarantine norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X