వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నోడు అప్పుడేనా, సిద్ధమా: కిరణ్ సన్యాసంపై టి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసెంబ్లీకి పంపించిన తెలంగాణ బిల్లునే పార్లమెంటులో ప్రవేశ పెట్టే దమ్ముందా? అదే బిల్లు పార్లమెంటులో పెడితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు తెలంగాణ నేతలు స్పందించారు.

ముఖ్యమంత్రి తన మిత్రుడు అని, చాలా చిన్నవాడు అని, ఆయన రాజకీయాల నుండి అప్పుడే తప్పుకోవాలని తాను భావించడంలేదని, ఇంకా కొనసాగాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ అన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువును ఉపయోగించుకోకుండా ఇంకా పెంచాలని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు.

Kiran Kumar Reddy

రాష్ట్రపతి మరోసారి గడువు ఇచ్చే అవకాశమున్నా వారం రోజుల కంటే ఎక్కువగా ఇవ్వక పోవచ్చునని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులకు ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అంటూ మాట్లాడే హక్కు లేదన్నారు. సీమాంధ్రులకు కాంగ్రెసు పార్టీ మాత్రమే న్యాయం చేయగలుగుతుందని చెప్పారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెడతారన్నారు. రాష్ట్ర సరిహద్దులు సూచించే హక్కు పార్లమెంటుదే అని చెప్పారు.

సన్యాసం తప్పదని హరీష్ రావు

ముఖ్యమంత్రికి రాజకీయ సన్యాసం తప్పదని సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు అన్నారు. తెలంగాణ వస్తుందనే విషయం ముఖ్యమంత్రికి తెలుసునన్నారు. అందుకే రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. అధిష్టానాన్ని ధిక్కరించిన సిఎంకు మళ్లీ అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కింద పని చేయడానికి సిఎంకు ఇష్టముండదని, బాబుతో కలిసి పని చేసే అవకాశం ఏమాత్రం లేదన్నారు. కిరణ్ విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌కు తమ్ముడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అదే బిల్లు పెట్టరు: డికె అరుణ

ముసాయిదా బిల్లును పార్లమెంటులో యథాతథంగా ప్రవేశ పెట్టరని మంత్రి డికె అరుణ అన్నారు. విభజన కారణంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోరని తాము భావిస్తున్నామని గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.

English summary
All the party leaders of Telangana region targetted Chief Minister Kiran Kumar Reddy on his challenge to High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X