అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో అక్రమ మద్యం .. వాటర్ ట్యాంకులో 10వేల బాటిళ్ళు.. తెలంగాణా నుండి కొరియర్ లో

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వానికి అక్రమ మద్యం దందా పెద్ద తలనొప్పిగా మారింది . తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నా రకరకాల మార్గాల ద్వారా మద్యం దందా సాగుతుంది. కొరియర్ , పార్సిల్ సర్వీసుల ద్వారా భారీగా అక్రమ లిక్కర్ దందా జరుగుతున్నట్టు గుర్తించారు ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు .

మద్యం అక్రమ రవాణా కేసు: ఏపీకి చెందిన ఇద్దరు ఎస్ఈబీ ఎస్సైలు,కానిస్టేబుళ్లు అరెస్ట్మద్యం అక్రమ రవాణా కేసు: ఏపీకి చెందిన ఇద్దరు ఎస్ఈబీ ఎస్సైలు,కానిస్టేబుళ్లు అరెస్ట్

 మద్యం ధరలు తగ్గించినా , ఆగని పక్క రాష్ట్రాల అక్రమ మద్యం దందా

మద్యం ధరలు తగ్గించినా , ఆగని పక్క రాష్ట్రాల అక్రమ మద్యం దందా

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో లిక్కర్ ధరలు విపరీతంగా పెంచటంతో ఏపీలోకి ఇతర రాష్ట్రాల మద్యం ఏరులై పారుతుంది. ఇక అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్న అధికార యంత్రాంగం మద్యం ధరలు తగ్గిస్తే దీనికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వానికి విన్నవించిన నేపధ్యంలో తాజాగా ధరల తగ్గింపును చేసింది ఏపీ సర్కార్ . అయినప్పటికీ ఇంకా అక్రమ మార్గాలలో మద్యం రవాణా అవుతూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా అక్రమ మద్యం పట్టుబడుతూనే ఉంది .

అమరావతి మండలం మునుగోడులో భారీగా మద్యం పట్టివేత

అమరావతి మండలం మునుగోడులో భారీగా మద్యం పట్టివేత

తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీకి మద్యం తరలించడానికి కనిపించిన ప్రతి అడ్డదారి తొక్కుతున్న లిక్కర్ మాఫియాబస్సుల్లో, కార్లలో ,కొరియర్ లో, టూవీలర్ ల మీద కూడా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీలో ఈ మద్యం వ్యాపారం చేసే వాళ్ళు వాటిని దాచేందుకు కొత్త పద్దతులను ఎంచుకున్నారు . ఇక తాజాగా పెద్ద వాటర్ ట్యాంక్ లో భారీగా తెలంగాణా మద్యం పట్టుబడింది .అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుకున్నట్టు ఎస్ఈ బీ అధికారులు చెప్పారు .

 వాటర్ ట్యాంకులో దాచిన తెలంగాణా లిక్కర్ పట్టుకున్న పోలీసులు

వాటర్ ట్యాంకులో దాచిన తెలంగాణా లిక్కర్ పట్టుకున్న పోలీసులు

ఒక వాటర్‌ ట్యాంకులో దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం దాచిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణ నుంచి కొరియర్‌ ద్వారా మద్యం తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎఈబీ అధికారులు విచారణలో గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వస్తున్న వాహనాల మీద, పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీలు చేస్తున్నా పోలీసుల కళ్లుగప్పి లిక్కర్ మాఫియా రేచ్చిపోతూనే ఉంది.

Recommended Video

T Journalist Forum: కాళేశ్వరం ఒక్కటే వరప్రదాయిని కాదు, తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులుపై భేటీ !
 మద్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం .. కేసులు నమోదు

మద్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం .. కేసులు నమోదు

ఏపీ ఎస్ఈబీ అధికారులు లిక్కర్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక వారికి సహకరించే అధికారులను కూడా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇటీవల పలువురు పోలీసులపై , ఎస్ఈబీ అధికారులపై కేసులు నమోదు చెయ్యటం ఇందుకు ఉదాహరణ . ఇబ్బడిముబ్బడిగా లిక్కర్ ని పట్టుకుంటున్న పోలీసులు, ఎస్ఈబీ అధికారులు లిక్కర్ మాఫియాపై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.

English summary
Heavy liquor was seized in Munagodu in Amaravati zone. Police have seized 10,000 bottles of Telangana liquor hide in a water tank. Eight people were arrested for hiding alcohol. SEB officials said that liquor was being brought from Telangana by courier and transported to other places from there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X