వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల గుట్టు విప్పిన హరీష్‌ రావు- ఆ 4 వేల కోట్ల కోసమే జగన్‌.. !

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి ఇప్పటికే ఉచిత విద్యుత్ ఇస్తున్న పలు రాష్ట్రాలు నిరాకరించాయి. వీటిలో తెలంగాణ కూడా ఒకటి. ఒకప్పుడు వైఎస్సార్‌ వ్యతిరేకించిన విద్యుత్‌ మీటర్లను బిగించేందుకు ఆయన తనయుడు జగన్‌ సిద్ధమవుతుంటే తెలంగాణ మాత్రం వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే రైతుల కోసం విద్యుత్‌ మీటర్లు బిగించి వారిని ఇబ్బంది పెట్టలేమని తేల్చేసింది. కానీ జగన్‌ మాత్రం దేశంలో అందరి కంటే ముందే విద్యుత్ మీటర్ల బిగింపుకు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఉన్న గుట్టును తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు తాజాగా బయటపెట్టారు.

ఉచిత విద్యుత్‌కు మీటర్లు...

ఉచిత విద్యుత్‌కు మీటర్లు...

ఏపీలో 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. అప్పట్లో విపక్షాలు వ్యతిరేకించినా, అధిష్టానం సహకరించకపోయినా అన్నింటినీ ఎదిరించి మరీ వైఎస్సార్‌ షరతుల్లేని ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు.. 2009లో ఆయన మరణం తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ కొనసాగుతోంది. అయితే ఒకప్పుడు షరతుల్లేకుండా వైఎస్‌ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ విషయంలో ఇప్పుడు కేంద్రం చెప్పిందని మీటర్లు బిగించేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. ఏపీలో విపక్షాలు వ్యతిరేకిస్తున్నా డిసెంబర్‌ నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా, వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీటర్ల బిగింపు ప్రారంభం కాబోతోంది. కానీ పొరుగున ఉన్న తెలంగాణ మాత్రం ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించి రైతులకు ఉరితాడు బిగించలేమని చెబుతోంది.

జగన్‌ మీటర్ల గుట్టువిప్పిన హరీష్‌..

జగన్‌ మీటర్ల గుట్టువిప్పిన హరీష్‌..


రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ కు మీటర్లు బిగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని జగన్ ఏపీలో అమలు చేస్తుండగా.. తెలంగాణలో అమలు చేసేందుకు కేసీఆర్‌ సర్కారు ససేమిరా అంటున్న విషయం అందరికీ తెలిసిందే. దాని వెనుక కేంద్రం ఇచ్చిన ఆఫర్‌ విలువ తెలిస్తే షాక్‌ కావడం ఖాయం. ఉచిత విద్యుత్‌ కు మీటర్లు పెడితే కేంద్రం తెలంగాణకు రూ.3500 కోట్లు, ఏపీకి రూ.4000 కోట్లు ఆఫర్‌ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్‌ రావు నిన్న దుబ్బాకలో స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే రూ.3500 కోట్లకు కక్కుర్తి పడి తాము రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని హరీష్‌ చాలా స్పష్టంగా చెప్పేశారు. దీంతో పాటు జగన్‌ తీరుపైనా ఆయన మండిపడ్డారు.

Recommended Video

AP Police Seva App Launch | అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు, దేశంలోనే తొలిసారి!!
జగన్‌ది అత్యుత్సాహమేనన్న హరీష్‌ రావు..

జగన్‌ది అత్యుత్సాహమేనన్న హరీష్‌ రావు..


ఉచిత విద్యుత్‌ మీటర్లపై కేంద్రం ఇచ్చిన ఆఫర్‌ను తాము తిరస్కరించినట్లు హరీష్‌ రావు తెలిపారు. అయితే ఏపీ సీఎం జగన్‌ మాత్రం 4 వేల కోట్ల కోసం ఆశ పడి విద్యుత్‌ మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నారని హరీష్‌ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించాలన్న జగన్‌ సర్కారు నిర్ణయం అత్యుత్యాహమేనని హరీష్‌ రావు ఆరోపించారు. కేంద్రం ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి ఏపీ రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారంటూ హరీష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీ సర్కారు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని మాత్రం అమలు చేసేందుకే మొగ్గుచూపుతోంది. దీనిపై రైతులను ఒప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లోగా రైతులతో భేటీలు నిర్వహించి వారిని ఉచిత విద్యుత్ కు మీటర్లు పెట్టుకునేలా అవగాహన కల్పించబోతోంది.

English summary
telangana finance minister harish rao made interesting comments on neighbouring andhra pradesh government's plan on fixing meters to free power connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X