వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన అంతర్జాతీయ పార్టీ అవ్వచ్చు: నిరసనలపై ఏపీ ప్రభుత్వం ఆలోచించాలి: మంత్రి కేటీఆర్..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పైన తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన జనసేన పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా జనసేన ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం పైన సెటైరికల్ గా స్పందించారు.

జనసేన అంతర్జాతీయ పార్టీ అవుతుందేమో

జనసేన అంతర్జాతీయ పార్టీ అవుతుందేమో

ఏపీలో రాజధాని మార్పు పైన ఆందోళనలు..నిరనసలు సాగుతున్నాయని..దీని పైన ప్రభుత్వం ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జనసేన అంతర్జాతీయ పార్టీ అవుతుందేమో అంటూ కామెంట్ చేసారు. ఇక, తెలంగాణలో తాము చిన్న ఇబ్బంది లేకుండా జిల్లాలు ఏర్పాటు చేసామని చెప్పుకొచ్చారు. తాము ఏనాడైనా ఎంఐఎంతో కలిసి పోటీ చేసామా అనే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. నివేదిక వచ్చిన తరువాతనే ఉద్యోగుల పీఆర్సీ పైన నిర్ణయం ఉంటుందన్నారు.

నిరసనలపైన ఆలోచించాలి..

నిరసనలపైన ఆలోచించాలి..

ఏపీలో రాజధాని గురించి నిరసనలు..ఆందోళనలు సాగుతున్నాయని..వ్యతిరేకత వస్తోందని..ఇలా ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం ఆలోచన చేయాలని తెలంగాన మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టా గోష్టిగా మాట్లాడిన కేటీఆర్ ఏపీలో పరిస్థితుల పైన స్పందించారు. తాము తెలంగాణలో ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా..రవ్వంత ఆందోళన కూడా రాలేదన్నారు. ఇక, బీజేపీ..జనసేన పొత్తు గురించి సైతం కేటీఆర్ స్పందించారు. జనసేన అంతర్జాతీయ పార్టీ అవుతుందోమే అంటూ వ్యాఖ్యానించారు. పవన్ ఏం చేస్తే తమకు ఏం సంబంధమని..ఏపీ ప్రజలే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. తన ఉద్దేశం ప్రకారం అధికార వికేం ద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్..జీహెచ్ఎంసీని సైతం విభజించాల్సిన అవసరం ఉందనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

కొత్త పరిపాలన..పురపాలన

కొత్త పరిపాలన..పురపాలన

మున్సిపల్ ఎన్నికల్లో విజయం పైన కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు. తమ ముందున్న లక్ష్యం కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేయటమే సవాల్ గా మారిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశం లో ఎన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దిందో చెప్పాలని డిమాండ్ చేసారు. తమ పార్టీలో రెబల్ అభ్యర్ధులకు బీజేపీ సహకారం అందిస్తోందని ఆరోపించారు. ఇక, తమ మంత్రికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నా రని మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ పైన నివేదిక వచ్చిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సమయంలో ఆర్దిక మాంధ్యం అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము ఎంఐఎం కోసం పని చేస్తున్నామని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు తమ రెండు పార్టీలు కలిసి ఎప్పుడైనా పోటీ చేసాయో అనే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

English summary
Telangana Minister KTR key comments on capital shifting and agitation in AP. He says govt should concentrate on this issue. KTR saying that Janasena may became international party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X